Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంతే : పాంటింగ్

Ricky Ponting Says Rishabh Pant a huge talent, will be back in India XI soon

సిడ్నీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌లో నైపుణ్యాలు పుష్కలమని, త్వరలోనే తుదిజట్టులోకి వస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇక కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌తో పంత్ బెంచ్‌కే పరిమితమవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడి కంకషన్ గురైన పంత్.. మళ్లీ తుదిజట్టులోకి రాలేదు.

అతని స్థానంలో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు కీపింగ్.. ఇటు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. దీంతో టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా రాహుల్‌నే కొనసాగిస్తుంది. పైగా రాహుల్ కీపింగ్ చేస్తే మరో అదనపు బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకొచ్చని భావిస్తోంది. దీంతో ఈ యువ వికెట్ కీపర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

టీమిండియా లెజెండ్స్ సునీల్ గావస్కర్, గౌతం గంభీర్ సైతం పంత్‌నే కీపర్‌గా కొనసాగించాలని సూచించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ పట్టించుకోవడంలేదు. వరల్ట్ టీ20 టోర్నీకి సన్నాహకంగా జరుగుతున్న సిరీస్‌ల్లో పంత్ ఆడకపోవడంతో అతని కెరీర్‌ గందరగోళంలో పడింది.

ఇప్పుడు ఇదే విషయాన్ని కొందరు అభిమానులు ఆస్ట్రేలియా దిగ్గజం , ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటర్ రికీ పాంటింగ్ ద‌ృష్టికి తీసుకెళ్లగా.. టీమిండియా కీపర్ రిషబ్ పంతేనని స్పష్టం చేశాడు. 'అపారమైన నైపుణ్యాలు రిషబ్ పంత్‌ సొంతం. త్వరలోనే అతను కచ్చితంగా టీమిండియా తుది జట్టులోకి వస్తాడు. ఐపీఎల్ నేపథ్యంలో అతనితో మళ్లీ పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా.'అని ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. మిగతా మ్యాచ్‌లోనైనా పంత్ అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

Story first published: Monday, January 27, 2020, 23:06 [IST]
Other articles published on Jan 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+