Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC ఫైనల్లో టీమిండియా గెలవాలంటే కేఎస్ భరత్‌కు బదులు అతన్నే ఆడించాలి: రికీ పాంటింగ్

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్దమవుతున్న టీమిండియాకు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక సలహాలు ఇచ్చాడు. తుది జట్టులో వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌‌కు బదులు ఇషాన్ కిషన్‌ను ఆడించాలన్నాడు. రిషభ్ పంత్ తరహాలో ఇషాన్ కిషన్ రాణించగలడని, అతనికి ఆ సత్తా ఉందని తెలిపాడు.

హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఉంటే టీమిండియా మరింత పటిష్టంగా ఉండేదని, అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా రాణించేవాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2023 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఫోకస్ పెట్టారు. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

KS Bharat

ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్‌పై రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.'డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా గెలవాలంటే తుది జట్టులోకి ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలి.

నేనైతే ఇషాన్ కిషన్‌కే అవకాశం ఇస్తాను. వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలంటే.. మ్యాచ్ గెలవాలి. అందుకే విజేతను తేల్చడం కోసం రిజర్వ్ డేగా ఆరో రోజును కూడా కేటాయించారు. ఇషాన్ కిషన్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా ఉపయోగపడతాడు. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ జట్టులో ఉండాలి. కారు ప్రమాదం కారణంగా రిషభ్ పంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు.

అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎస్ భరత్ కీపింగ్‌లో ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. ఒక వేళ రిషభ్ పంత్ ఫిట్‌గా ఉంటే.. అతను ఆడేవాడు. భారత్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉపయోగపడేవాడు. కానీ పంత్ లేడు కాబట్టి భరత్ కంటే ఇషాన్ కిషన్‌ను తీసుకోవడం మంచిది. ఇషాన్ కిషన్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు.

అలాగే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేస్తే బాగుండేది. టెస్ట్ మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ హార్దిక్‌కు లేదంటున్నారు. కానీ ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే కదా.. ఐపీఎల్‌లో హార్దిక్ ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేశాడు. అతను జట్టులో ఉంటే బ్యాట్‌తో పాటు బంతితో ఏం చేయగలడో మనకు తెలుసు. ఇరు జట్ల మధ్య అతనే తేడా అయ్యేవాడు'అని ఐసీసీ రివ్యూలో పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పర్వాలేదనిపించిన ఇషాన్ కిషన్ ఇంకా టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయలేదు. దేశవాళీ క్రికెట్‌లో కూడా అతని రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు.

Story first published: Wednesday, May 31, 2023, 21:01 [IST]
Other articles published on May 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+