Ricky Ponting: ఫ్యాన్స్ అంతా కోహ్లీ రిటైర్మెంట్ కోరుకుంటున్నారు!
World Cup 2023: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరు చూసి.. ఇతర దేశాల అభిమానులు అతను త్వరగా రిటైర్మెంట్ కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు.
మరో ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీ క్రికెట్‌కు దూరం కావాలని ప్రార్థిస్తున్నారని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ 2023లో జోరు మీదున్న విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 108.60 సగటుతో 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.\

సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ(101 నాటౌట్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డ్‌ను సమం చేశాడు.
ఈ వరల్డ్ రికార్డ్ నేపథ్యంలో మాట్లాడిన రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇండియన్ ఫ్యాన్స్ తప్పా ఇతర అభిమానులంతా విరాట్ కోహ్లీ మరో ప్రపంచకప్ ఆడవద్దని కోరుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. అతని రికార్డులు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. సచిన్ కంటే 175 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి అతని రికార్డ్‌ను కోహ్లీ సమం చేశాడు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో సత్తా చాటిన కోహ్లీ.. పాకిస్థాన్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో డకౌటైన కోహ్లీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 16 పరుగులే చేశాడు. టేబుల్ టాపర్‌గా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
నంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్ ఆడనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల్లో రెండు జట్లు సెమీస్ చేరే అవకాశం ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications