For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈసారి టీ20 ప్రపంచకప్‌ని ఆ జట్టే గెలుస్తుంది: పాంటింగ్‌

Ricky Ponting says Australia to win T20 World Cup 2021
T20 World Cup 2021 గెలిచే సత్తా వాళ్ళకే ఉంది - Ricky Ponting || Oneindia Telugu

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం టీ20 ప్రపంచకప్‌ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌ని ఆసీస్ గెలుస్తుంది

టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికి పాంటింగ్‌ జోస్యం చెప్పాడు. 'జోష్ ఇంగ్లిష్ జట్టులో చోటు దక్కించుకోవడం అద్భుతంగా ఉంది. అతడు సరదాగా పరుగులు చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. సీనియర్లు కీలక పాత్ర పోషిస్తారు. టీ20 ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఈ జట్టుకు ఉందని భావిస్తున్నా' అని పాంటింగ్ ట్వీట్‌ చేశాడు.

వన్డే ప్రపంచకప్‌లో తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తూ.. ఐదుసార్లు విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. కానీ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ని ఒక్కసారి కూడా ఆసీస్ అందుకోలేదు. ఈసారి ఆ కలను నెరవేర్చుకోవాలని ఫించ్ సేన చూస్తోంది.

15 మందితో కూడిన జట్టు

15 మందితో కూడిన జట్టు

టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టుని సీఏ ఎంపిక చేసింది. మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న అరోన్ ఫించ్ ఫిట్‌నెస్ సాధించడంతో.. అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫించ్ జట్టులోకి అంబాటులోకి రావడంతో.. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ వైస్‌ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు. వెస్టిండీస్ పర్యటనకి భిన్నమైన కారణాలతో దూరమైన స్టీవ్‌ స్మిత్, డేవిడ్ వార్నర్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌కి టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది.

పటిష్టంగా ఆస్ట్రేలియా

పటిష్టంగా ఆస్ట్రేలియా

డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్‌, అరోన్ ఫించ్, మాథ్యూ వెడ్, మిచెల్ మార్ష్, మార్కస్‌ స్టాయినిస్, అస్టన్ అగర్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ మంచి ఆరంభాన్ని ఇస్తే.. ఆ తర్వాత స్మిత్‌, మార్ష్, మాక్స్‌వెల్‌, స్టాయినిస్ చెలరేగనున్నారు. ఇక పేస్ దళాన్ని పాట్ కమిన్స్‌ ముందుండి నడిపించనున్నాడు. మిచెల్ స్టార్క్, జోస్ హేజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్ అతడికి అండగా నిలవనున్నారు. బ్యాట్స్‌మన్‌ జోష్ ఇగ్లిష్ కూడా చోటు డాకించుకున్నాడు. మొత్తానికి ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

India vs England: 'టెస్టు క్రికెట్ కోసం విరాట్​ కోహ్లీకి తపన పడటం ఎంతో బాగుంది.. అచ్చం నాలానే'

 అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో

అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో

గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి.

ఇక ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 30న ఇంగ్లండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది.

ఆస్ట్రేలియా జట్టు

ఆస్ట్రేలియా జట్టు

అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇగ్లిష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్‌ స్టాయినిస్, అస్టన్ అగర్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వెడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

Story first published: Friday, August 20, 2021, 11:11 [IST]
Other articles published on Aug 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+