15 రోజుల ముందు చెప్తున్నా.. పాకిస్థాన్‌పై భారత్‌దే విజయం! రాసిపెట్టుకొండి: రికీ పాంటింగ్

సిడ్నీ: ఆసియాకప్‌లో భాగంగా దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రేజ్‌ను ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టింగ్ చానెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ప్రతీ టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నాయి.

భారత్‌దే విజయం..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం ఈ ఫార్మూలాను ఫాలో అయ్యింది. ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించింది. దాంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన బజ్ ఏర్పడగా.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇరు జట్లకు పలు సూచనలు చేయడంతో పాటు తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం తన జోస్యాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని అంచనా వేసాడు.

20 ఏళ్ల గడిచినా క్రేజ్ తగ్గదు..
‘మరో 15-20 ఏళ్లు గడిచినా సరే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. క్రికెట్ చరిత్రలో ఈ ఇరు జట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు. ఒక క్రికెట్ లవర్‌గా నేను చెప్పేది ఏంటేంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా చిరకాల ప్రత్యర్థులగానే చూసినప్పటికీ... అది యాషెస్ లాంటి టెస్టు సిరీస్‌కు మాత్రమే పరిమితం అవుతోంది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఆధిపత్య ధోరణి అలా ఉండదు. వన్డే, టెస్టు, టీ20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులుగానే పరగణిస్తారు. ఇరు దేశాల అభిమానులు భావోద్వేగంతో వీక్షిస్తారు. అందుకే ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

పాక్ ఒత్తిడికి చిత్తవుతోంది..
ఇక ఆసియాకప్‌లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. కానీ నా అంచనా ప్రకారం టీమిండియానే గెలుస్తుందనుకుంటున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది.


భారత్ బలం అదే..
ఇరుజట్ల ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేనప్పటికి.. నా దృష్టిలో మాత్రం భారత్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక ఆసియాకప్‌కు ఎంపిక చేసిన భారత్ జట్టు కూడా సమతుల్యంగా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో హెవీ రొటేషన్‌లోనూ భారత్ 21 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌లు గెలిచింది. కెప్టెన్లు మారినా టీమిండియా సక్సెస్ మాత్రం ఎక్కడా ఆగలేదు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ దూరమైనప్పటికి బౌలింగ్ టీమ్ పటిష్టంగా ఉండడం సానుకూలాంశం. రానున్న టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్ టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications