
నాలుగో స్థానం బెస్ట్ స్పాట్..
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు గాయాలైనా సూర్యతో ఓపెనింగ్ చేయించవచ్చనే ధీమాతో టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాంటింగ్ మాత్రం సూర్యను వీలైనంత వరకు కొత్త బంతి ఆడకుండా దూరంగా ఉంచాలన్నాడు. ‘సూర్య మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడటంతో పాటు ఓపెనర్‌గా కూడా రాణించగలడు. అయితే అతన్ని కొత్త బంతిని దూరంగా ఉంచితే మిడిలార్డర్‌లో సత్తా చాటుతాడు. పవర్ ప్లే అనంతరం ఆటపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు రాబడతాడు. టాప్-4లో అతను ఆడటం కరెక్ట్. నేను అయితే అతన్ని ఓపెనింగ్ చేయను. నా అభిప్రాయం ప్రకారం అతనికి నాలుగో స్థానం బెస్ట్ స్పాట్.

ఇండియా ఏబీడీ..
సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ మాదిరే సూర్యకుమార్ యాదవ్ కూడా 360 డిగ్రీల్లో షాట్లు ఆడతాడు. ఏబీ ఆడినట్లే ల్యాప్ షాట్స్, లేట్ కట్స్, ర్యాంప్ షాట్లు ఆడుతున్నాడు. ముఖ్యంగా లెగ్‌సైడ్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా అతడు కొట్టే ఫ్లిక్ షాట్లు అద్భుతం. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నందున సూర్యను నాలుగో స్థానంలో దించితే మంచిది'అని ఐసీసీ రివ్యూలో పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

పాక్‌పై భారత్‌దే విజయం..
ఆసియాకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు. ‘గత 15-20 ఏళ్లుగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రికెట్ చరిత్రలో ఈ ఇరు జట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు. ఒక క్రికెట్ లవర్‌గా నేను చెప్పేది ఏంటేంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా చిరకాల ప్రత్యర్థులగానే చూసినప్పటికీ... అది యాషెస్ లాంటి టెస్టు సిరీస్‌కు మాత్రమే పరిమితం అవుతోంది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఆధిపత్య ధోరణి అలా ఉండదు. వన్డే, టెస్టు, టీ20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులుగానే పరగణిస్తారు. ఇరు దేశాల అభిమానులు భావోద్వేగంతో వీక్షిస్తారు. అందుకే ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.


పాక్ ఒత్తిడికి చిత్తు..
ఇక ఆసియాకప్‌లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. కానీ నా అంచనా ప్రకారం టీమిండియానే గెలుస్తుందనుకుంటున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది.'అని పాంటింగ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












