Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కాదు.. అతనే అత్యంత నైపుణ్యమైన బ్యాటర్: రికీ పాంటింగ్

తాను ఆడిన ప్రత్యర్థి ఆటగాళ్లలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అత్యంత నైపుణ్యమైన బ్యాటర్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు సైతం స్కిల్‌ఫుల్ బ్యాటర్లు అయినప్పటికీ వారి కంటే లారాకే అత్యుత్తమమైన నైపుణ్యం ఉందన్నాడు. ఈ తరం ఆటగాళ్లలో జోరూట్ అత్యంత స్కిల్‌ఫుల్ బ్యాటర్ అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ను ఉద్దేశించి మాట్లాడిన రికీ పాంటింగ్.. నైపుణ్యమైన బ్యాటర్ల వివరాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నేను ఆడిన సమయంలో అత్యంత నైపుణ్యం కలిగిన బ్యాటర్ బ్రియాన్ లారా. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. అతనే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కూడా టెక్నికల్‌‌గా మంచి బ్యాటర్లు. కానీ అత్యుత్తమ టెక్నికల్ బ్యాటర్ మాత్రం లారానే. ఈ తరంలో మాత్రం జో రూట్, కేన్ విలియమ్సన్‌లు మంచి టెక్నికల్ బ్యాటర్లు. బెన్ స్టోక్స్‌ను టెక్నికల్ బ్యాటర్ అని చెప్పలేం. ఎందుకంటే అతను కండిషన్స్‌కు తగ్గట్లు ఆడుతాడు. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు.

Ricky Ponting Picks Brian Lara Over Sachin Tendulkar as the Most Skillful Batter He Played Against

దిగ్గజ ఆటగాళ్ల గురించి మాట్లాడేటప్పుడు.. వారు ఆటపై చూపిన ప్రభావాన్ని ప్రస్తావించాలి. జో రూట్ కొన్ని రోజుల క్రితమే తాను కెరీర్ ఆరంభంలో రికార్డుల కోసం ఆడేవాడినని, ఇప్పుడు జట్టు విజయాల కోసం ఆడుతున్నానని చెప్పాడు. అదృష్టవశాత్తు మా తరంలో మేం ఎక్కువగా విజయవంతమైన జట్లలో ఆడాం.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఆ తరంలో సచిన్, లారా, పాంటింగ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. ఈ ముగ్గురు వన్డే, టెస్ట్‌ల్లో 10 వేలకు పైగా పరుగులు చేశారు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ కొనసాగుతుండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ లారా పేరిట ఉంది.

Story first published: Sunday, August 10, 2025, 11:35 [IST]
Other articles published on Aug 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+