For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సిరీస్ డ్రా చేసుకోవడం.. గత సిరీస్ ఓటమి కన్నా ఘోరం: పాటింగ్‌

Ricky Ponting feels Drawn test series will be worse than the loss a couple of years ago
Ind v Aus 4th Test: Drawn Series Will Be Worse Than The Loss In 2018-19 - Ponting | Oneindia Telugu

బ్రిస్బేన్‌: గాయాలపాలై బలహీన పడిన టీమిండియాపై సిరీస్ డ్రా చేసుకోవడం గత సిరీస్ ఓటమి కన్నా ఘోరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్‌ అభిప్రాయపడ్డాడు. సమయం తక్కువగా ఉండటంతో ఆఖరి టెస్టులో విజయం, డ్రాలో రహానే సేన దేనికోసం ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉందన్నాడు. మంగళవారం ఆట తొలి గంటలో ఎవరి పరిస్థితి ఏంటో తేలిపోతుందని పాటింగ్‌ పేర్కొన్నాడు. టీమిండియా గొప్ప పట్టుదల, పోరాటం ఏదో ఒక దశలో ఆగాల్సిందేనని రికీ అంటున్నాడు.

ఆసీస్‌కు పాంటింగ్‌ సలహా:

ఆసీస్‌కు పాంటింగ్‌ సలహా:

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం రెండు భారత్-ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నాలుగో టెస్టులో ఆఖరి రోజైన మంగళవారం రహానే సేన విజయం కోసం 324 పరుగులు చేయాలి. ఒకవేళ డ్రా చేయాలనుకుంటే.. రోజంతా వికెట్లు కాచుకోవాలి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు లేని టీమిండియా చేతిలో ఆసీస్‌ ఓటమి పాలవ్వొద్దని, మ్యాచులో గెలిచి తీరాలని రికీ పాంటింగ్‌ ఆసీస్‌కు సలహా ఇస్తున్నాడు.

డ్రా చేసుకోవడం.. గత సిరీస్ ఓటమి కన్నా ఘోరం:

డ్రా చేసుకోవడం.. గత సిరీస్ ఓటమి కన్నా ఘోరం:

తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ మాట్లాడుతూ... 'ఈ సిరీస్ డ్రా చేసుకోవడం రెండేళ్లనాటి ఓటమి కన్నా ఘోరం. నేనైతే ఇలాగే చూస్తాను. ఎందుకంటే ఈ సిరీసులో పోరాడేందుకు టీమిండియా 20 మందిని తీసుకుంది. ఆసీస్‌ జట్టులోకి డేవిడ్ వార్నర్‌ వచ్చాడు. స్టీవ్ స్మిత్‌ అన్ని టెస్టులూ ఆడాడు. క్రితంసారి వారు లేరు. ఇప్పడు మంచి ఫామ్‌లో ఉన్న మార్నస్ లబుషెన్ కూడా ఉన్నాడు. అందుకే డ్రా చేసుకోవడం ఓటమి కన్నా ఘోరమని నా అభిప్రాయం' అని అన్నాడు. పాటింగ్ ఆస్ట్రేలియా జట్టుకు రెండు వన్డే ప్రపంచకప్‌లు అందించిన విషయం తెలిసిందే.

వికెట్లు పోకుంటే మాత్రం:

వికెట్లు పోకుంటే మాత్రం:

'టీమిండియా చేస్తున్న పోరాటం ఎక్కడో ఓ చోట ఆగాల్సిందే. బహుశా మంగళవారమే ఆ రోజు కావొచ్చు. సిరీస్‌లో చివరి రోజు కాబట్టి భారత్‌ బహుశా డ్రా కోసం ప్రయత్నించొచ్చు. ఎవరో ఒకరు వదిలేయాల్సిందేనన్నది నా అభిప్రాయం‌. విజయం కోసం ఆసీస్ శతవిధాలా పోరాడుతుందని తెలుసు. మంగళవారం తొలి గంట అత్యంత కీలకం. వికెట్లు పోకుంటే మాత్రం భారత్ వేగంగా పరుగులు చేయాలి. కానీ సిరీసులో ఇంత వేగంతో వారెప్పుడూ పరుగులు చేయలేదు. ఓపెనర్లు వేగంగా పరుగులు చేస్తే.. పంత్‌ను మళ్లీ ముందుగా పంపించొచ్చు. అప్పుడు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేదంటే 98 ఓవర్లు డిఫెండ్‌ చేయాలి' అని రికీ పాంటింగ్‌ అన్నాడు.

డ్రా చేసుకున్నా ట్రోఫీ మనవద్దే:

డ్రా చేసుకున్నా ట్రోఫీ మనవద్దే:

ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్‌-గవాస్కర్ (2018-19) సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్‌ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌ నెగ్గకపోతే మాత్రం ఆసీస్‌ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌తో తలపడుతోన్న ఆ జట్టు డ్రా చేసుకున్నా అది ఓటమితో సమానమే.

రోహిత్‌ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?

Story first published: Tuesday, January 19, 2021, 7:47 [IST]
Other articles published on Jan 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+