భారత్‌తో పోరాడేందుకు ఫించ్ బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దిన పాంటింగ్

న్యూ ఢిల్లీ: ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో జరుగుతున్న రెండో టెస్టు పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి జరగనుంది. బౌన్సీ బౌలింగ్‌కు అనుకూలంగా ఓపెనర్ ఆరోన్ ఫించ్ పేలవ ఫామ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి పెద్ద తలనొప్పిగా మారింది. అడిలైడ్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టులో.. 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 (0, 11) పరుగులే చేసిన ఆరోన్ ఫించ్ సులువుగా భారత్‌కి వికెట్ ఇచ్చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయిన ఫించ్.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకున్నాడు.

తొలి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఫించ్
వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో తొలి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఫించ్ ఔటయ్యాడు. కానీ.. రిప్లైలో ఇషాంత్ నోబాల్ విసిరినట్లు తేలడంతో అతనికి జీవనదానం లభించింది. కానీ.. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను ఔటయ్యాడు. వన్డే, టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే ఆరోన్ ఫించ్ టెస్టుల్లో ఇలా తేలిపోతుండటంతో అతని బ్యాటింగ్‌ని సరిదిద్దాల్సిందిగా రికీ పాంటింగ్‌ను ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్ ఇటీవల అభ్యర్థించింది.

వార్నర్ స్థానాన్ని భర్తీ చేసిన ఫించ్
బాల్ టాంపరింగ్ కారణంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టెస్టుల్లో సుదీర్ఘకాలంగా మెరుగైన ఆరంభాలిచ్చిన అతని స్థానాన్ని ఫించ్ భర్తీ చేయలేకపోతున్నాడు. ఏడాది కాలం పాటు నిషేదానికి గురైన వార్నర్ దేశీవాళీ లీగ్‌లలో ఆడుతూ కాలం వెల్లదీస్తున్నాడు.
ముంబై ఇండియన్స్ బస్సు ఎవరెక్కితే బాగుంటుంది??

ఆత్మస్థైర్యం నింపేందుకు మరో అవకాశం
పెర్త్‌లో శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌కి హాజరైన రికీ పాంటింగ్.. దాదాపు గంటపాటు ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ని పరిశీలించి.. టెక్నిక్స్‌ని వివరించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు కోసం శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన తుది జట్టులోనూ ఆరోన్ ఫించ్‌కి ఓపెనర్‌గా మరో అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అతనిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

ఇక బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఖాయంగానే
తొలి టెస్టు పరాజయం అనంతరం శుక్రవారం పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ నేపథ్యాన్ని బౌన్సింగ్‌కు అనుకూలంగా మార్చడంతో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. భారత్-ఆస్ట్రేలియా జట్లలో బౌలింగ్ విభాగానికి కొదవ లేకపోవడంతో ఇక బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఖాయమనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications