For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్.. ఈ రిస్కీ షాట్స్ వద్దు: రికీ పాంటింగ్

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ విలువైన సలహా ఇచ్చాడు. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి రిస్కీ షాట్స్ ఆడవద్దని సూచించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. దాంతో తీవ్ర గాయమై రక్త స్రావమైంది.

రిషభ్ పంత్ గాయంపై స్పందించిన రికీ పాంటింగ్.. ఫ్రాక్చర్ కావద్దని కోరుకున్నాడు. పంత్ దూరమైతే టీమిండియా తీరని నష్టమని చెప్పాడు. 'నేల మీద పాదం పెట్టేందుకు రిషభ్ పంత్ అల్లాడిపోయాడు. గోల్ఫ్ కార్ట్ వచ్చేవరకూ దాదాపు ఆరు నిమిషాల పాటు చాలా ఇబ్బందిపడ్డాడు. బంతి తగిలిన వెంటనే అతని పాదం వాచిపోయింది. ఈ వాపే ఆందోళనకు గురిచేస్తోంది. పాదం ఎముక ఏమైనా విరిగిందా? అనే సందేహం కలుగుతోంది.

Ricky Ponting Advises Rishabh Pant to Avoid Risky Shots for Longevity

విరగడం లేదా ఫ్రాక్చర్ అయితే మాత్రం పంత్ ఈ మ్యాచ్‌కు దూరమైనట్లే. అలాకాకుండా ఉంటే మాత్రం పంత్‌ను వైద్య సిబ్బంది బ్యాటింగ్‌కు రెడీ చేస్తోంది. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి రిస్కీ రివర్స్ స్వీప్ షాట్లను పంత్ ఆడడని ఆశిస్తున్నా. మ్యాచ్ పరిస్థితిని గమనిస్తే శార్దూల్ ఠాకూర్ మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. కానీ పంత్ ఆడిన విధానం.. అతను తీసుకొచ్చే జోష్ టీమిండియాకు చాలా అవసరం. పంత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. భారత అభిమానులంతా పంత్ గాయం తీవ్రమైంది కాకూడదని కోరుకోవాలి. అతను దూరమైతే టీమిండియాకు తీవ్ర నష్టం జరుగుతుంది.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

అయితే స్కానింగ్‌లో రిషభ్ పంత్ కుడి కాలి చిటికెన వేలుకు ఫ్రాక్ఛర్ అయినట్లు తేలింది. దాంతో వైద్యులు అతనికి 6 వారాలా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Story first published: Thursday, July 24, 2025, 15:31 [IST]
Other articles published on Jul 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+