Ricky Ponting టాప్-5 టెస్ట్ బ్యాట్స్‌మెన్.. భారత్ నుంచి ఒక్కడే! రోహిత్ శర్మకు నో చాన్స్!

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ తరం టాప్-5 టెస్ట్ బ్యాట్స్‌న్‌ను ఎంపిక చేశాడు. ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్ సందర్భంగా సహచర ఆటగాడు, మాజీ కోచ్ సైమన్ కటీచ్‌తో కలిసి అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ లిస్ట్‌లో నలుగురి ఆటగాళ్లపై ఈ ఇద్దరూ దిగ్గజ ప్లేయర్స్ ఏకాభిప్రాయానికి రాగా.. ఒక్క ఆటగాడి విషయంలో మాత్రం భేదాభిప్రాయాలు వచ్చాయి. అది కూడా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలోనే కావడం విశేషం. రికీ పాంటింగ్ తన టాప్-5 బ్యాట్స్‌మన్ లిస్ట్ విరాట్ కోహ్లీకి చోటివ్వగా.. సైమన్ కటిచ్ మాత్రం రోహిత్ శర్మను ఎంచుకున్నాడు.

ఫాబ్-4కు చోటు..
ఈ తరం క్రికెట్‌లో ఫాబ్-4గా భావించే విరాట్ కోహ్లీ, జోరూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లను తన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించిన రికీ పాంటింగ్ ఈ లిస్ట్‌లో మార్నస్ లబుషేన్‌ను జత చేశాడు. తన జాబితాలో జోరూట్‌ను నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించిన పాంటింగ్..లుబుషేన్‌కు సెకండ్, విలియమ్సన్‌కు థర్డ్ ర్యాంక్ ఇచ్చాడు. ఇక స్మిత్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేసిన పాంటింగ్.. విరాట్ కోహ్లీకి ఐదో స్థానం కేటాయించాడు.

కోహ్లీని విస్మరించిన కటీచ్..
ఇక సైమన్ కటీచ్ తన టాప్-5 బ్యాట్స్‌మన్‌లోకోహ్లీకి చోటివ్వలేదు. విరాట్‌కు బదులు రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. అంతేకాకుండా అతని నాలుగో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేర్కొన్నాడు. లబుషేన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన కటీచ్.. జోరూట్, కేన్ విలియమ్సన్‌కు రెండు, మూడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశాడు. స్టీవ్ స్మిత్‌కు ఐదో స్థానం కేటాయించాడు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా వ్యవహరించిన కటీచ్.. కోహ్లీని కాదని రోహిత్‌ను ఎంచుకోవడం గమనార్హం. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ వరకు ఆర్‌సీబీకి హెడ్ కోచ్‌గా కొనసాగిన కటీచ్.. సెకండాఫ్ ముందు తప్పుకున్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించనున్నాడు.

రికీ పాంటింగ్ టాప్-5 బ్యాట్స్‌మన్
1. జోరూట్,
2. మార్నస్ లబుషేన్
3. కేన్ విలియమ్సన్
4. స్టీవ్ స్మిత్
5. విరాట్ కోహ్లీ

సైమన్ కటీచ్ టాప్-5 బ్యాట్స్‌మన్
1. మార్నస్ లబుషేన్
2. జోరూట్
3. కేన్ విలియమ్సన్
4. రోహిత్ శర్మ
5. స్టీవ్ స్మిత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications