For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జస్‌ప్రీత్ బుమ్రా ఆట ఎన్నాళ్లో..? : న్యూజిలాండ్ దిగ్గజం

Richard Hadlee says Jasprit Bumrah’s unusual action may cause him injuries in the longer run
Jasprit Bumrah's Bowling Technique విభిన్న బౌలింగ్... అదే వరం అదే శాపం ! || Oneindia Telugu

లండన్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడటంపై న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రిచర్డ్ హెడ్లీ సందేహం వ్యక్తం చేశాడు. అతని విభిన్నమైన శైలి వల్ల ఎక్కువ గాయాలయ్యే ప్రమాదం ఉందన్నాడు. అందువల్ల బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతాడో లేదో చెప్పడం కష్టమేనన్నాడు. అయితే ఆ విభిన్న బౌలింగ్ టెక్నికే బుమ్రా అసాధారణ బౌలర్‌గా నిలబెట్టిందని ప్రశంసించాడు.

జూన్​ 18-22వరకు కివీస్​, భారత జట్టు మధ్య ప్రపంచటెస్టు చాంపియన్​షిప్​ ఫైనల్​ జరగనున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్ హెడ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బుమ్రా ఎక్కువ పరుగెత్తకుండానే అద్భుతమైన టెక్నిక్​తో బౌలింగ్​ చేస్తాడు. అది నమ్మశక్యంగా లేకపోయినా, ఎంతో ప్రభావితంగా ఉంటుందని నిరూపించాడు.​ బంతిని విసిరేటప్పుడు చివరిక్షణంలో తన పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. భుజ బలంతోనే బంతిని వేగంగా విసురుతాడు.'అని హెడ్లీ చెప్పుకొచ్చాడు.

అయితే బుమ్రాకు ఉన్న అసాధారణమైన బౌలింగ్​ టెక్నిక్​ వల్ల అతను ఎక్కువగా గాయాల బారిన పడే అవకాశముందని తెలిపాడు. "బుమ్రా సుదీర్ఘ కాలం ఆడుతాడా లేదా అనేది చెప్పడం కష్టం. అతని విభిన్నమైన బౌలింగ్​ టెక్నిక్ వల్ల ఎక్కువగా గాయాలకు గురి అవుతాడని అనుకుంటున్నా.'అని హెడ్లీ సందేహం వ్యక్తం చేశాడు.

ఈ తరం క్రికెట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ తన దృష్టిలో అత్యుత్తమ అల్ రౌండర్ అని పేర్కొన్నాడు. ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమని తెలిపాడు. అలాగే అతను ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అనేక సందర్భాలను పరిగణలోకి తీసుకొనే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్టు చెప్పాడు. ఇందుకు 2019 వన్డే ప్రపంచ కప్, హెడింగ్లే టెస్టులను(ఆసీస్ పై135 నాటౌట్) ఉదహరించాడు.

ఐపీఎల్ నుంచి దూసుకొచ్చి జస్‌ప్రీత్ బు మ్రా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. విభిన్నమైన అతని బౌలింగ్ శైలి, షార్ట్ రనప్‌‌ను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అనతికాలంలోనే అతను టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదిగాడు. సౌతాఫ్రికా పర్యటనలో సంప్రదాయక ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 83 వికెట్లు తీశాడు. అయితే అతని టెస్ట్ కెరీర్ మొత్తం ఓవర్‌సిరీస్‌లోనే గడిచింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీసే స్వదేశంలో మొదటిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో బుమ్రా కీలకం కానున్నాడు. అతను రాణించడంపైనే భారత్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Wednesday, May 26, 2021, 14:15 [IST]
Other articles published on May 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+