For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తనకోసం జరుగుతున్న అన్వేషణపై స్పందించిన ఐపీఎల్ మిస్టరీ బ్యూటీ!

Riana lalwani who went viral during IPL Super Over shares memes about herself
IPL 2020: Mystery Girl Riana Lalwani In MI v KXIP Match | Riana lalwani INSTAGRAM account|Super Over

హైదరాబాద్: క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ పోరులో గోళ్లు కొరుకుతూ తళుక్కుమన్న మిస్టరీ బ్యూటీ స్పందించింది. తన పేరిట సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న హడావుడి, ఫన్ మీమ్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఆదివారం జరిగిన ఉత్కంఠకర పోరు.. రెండు సూపర్ ఓవర్లకు దారితీయగా ఓ అందమైన అమ్మాయి తళుక్కుమంది.

ఉత్కంఠకే ఊపిరి సడలని మ్యాచ్‌లో గోళ్లు కొరుకుతూ అమయాకంగా పెట్టిన ఆమె ఎక్స్‌ప్రెషన్‌కు టీవీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వెంటనే ఆమె వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఎట్టకేలకు ఆమె ఇన్‌స్టా వివరాలు తెలుసుకున్నారు. అమె పేరు రియానా లల్వానీ. ఈ ఒక్క సీన్‌తో ఆమె ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. దాంతో గత రెండు రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఐపీఎల్ సూపర్ ఓవర్ గర్ల్ అంటూ ఆమె ఫొటోలు సందడి చేస్తున్నాయి.

Riana lalwani who went viral during IPL Super Over shares memes about herself

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మద్దతు తెలిపిన రియానా లల్వానీపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌ రైనా సేవలు కోల్పతే.. పంజాబ్‌కు సూపర్ ఓవర్ రియానా దొరికిందని, దిగ్గజాలకు మాత్రమే ఆమె అందం కనిపించిందని కొనియాడుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేశారు. వీటిని రియానా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నవ్వుతూ 'హహహ..'అనే క్యాప్షన్ ఇచ్చింది.

Riana lalwani who went viral during IPL Super Over shares memes about herself

నేడు ఢిల్లీక్యాపిటల్స్‌తో పంజాబ్ తలపడుతుండటంతో ఈ మిస్టరీ గర్ల్‌ను మరోసారి చూడవచ్చని, ఆమె అందాన్ని కనులారా ఆస్వాదించవవచ్చని నెటిజన్లు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మరీ బ్యూటీ మరోసారి తళుక్కుమని కనువిందు చేస్తుందో? లేక మ్యాచ్‌కు రాకుండా నిరాశ పరుస్తోందో చూడాలి!

Riana lalwani who went viral during IPL Super Over shares memes about herself
Story first published: Tuesday, October 20, 2020, 15:30 [IST]
Other articles published on Oct 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+