For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: లక్నో జట్టును వీడటంపై రిషభ్ పంత్ ఏమన్నాడంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. రూ. 27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు రిషభ్ పంత్‌ను లక్నో కొనుగోలు చేయగా.. అతను మాత్రం 12 మ్యాచ్‌ల్లో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా 100 లోపే ఉండటం గమనార్హం. హైప్రైజ్ ట్యాగ్ ఒత్తిడో ఏమో తెలియదు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పంత్ విఫలమయ్యాడు. అతని వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటి బాట పట్టింది.

ఈ క్రమంలోనే రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వదిలేస్తుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రిషభ్ పంత్ ఆటతీరుపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తిగా ఉన్నాడని, అతన్ని తదుపరి సీజన్‌లో కొనసాగించే ఉద్దేశం లేదని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రిషభ్ పంత్‌కు రూ. 27 కోట్లు అనవసరమని కూడా లక్నో భావిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై రిషభ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవన్నీ ఫేక్ వార్తలని ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు.

Responsible and Sensible Rishabh Pant Shuts Down LSG Release Speculation for IPL 2026

'ఫేక్ న్యూస్ కంటెంట్‌కు ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతీదానితో నకిలీ వార్తలను సృష్టించవద్దు. ఒక ఎజెండాతో రాసే తప్పుడు వార్తల కంటే కొంచెం వివేకంతో నిజమైన వార్తలను ప్రచురించండి. సోషల్ మీడియాలో కాస్త బాధ్యతాయుతంగా, తెలివిగా ప్రవర్తించండి.'అని రిషభ్ పంత్ ట్వీట్ చేశాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది.

Story first published: Friday, May 23, 2025, 10:55 [IST]
Other articles published on May 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+