Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసుపత్రిలో చేరిన అనుష్క శర్మ.. మరి కొద్ది గంటల్లో గుడ్ న్యూస్!

Report says Anushka Sharma admits in hospital

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం గర్భవతమైన ఆమె మరికొద్ది గంటల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అనుష్క ప్రసవం జరగుతుందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ-అనుష్క జోడీకి వారి అభిమానులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. డెలీవరి టైమ్ సమీపించడంతో వైద్యుల సూచన మేరకు ముందుస్తుగానే అనుష్క ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

ఇక ప్రసవ సమయంలో అనుష్క పక్కనే ఉండేందుకు, తొలి బిడ్డ క్షణాలను ఆస్వాదించేందుకు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కోహ్లీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా.. మెజార్టీ సభ్యులు విరాట్‌కు అండగా నిలిచారు. ఇక ఆగస్టులో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విరాట్.. 'జనవరి మేం ముగ్గురం కాబోతున్నాం'అని ట్వీట్ చేశాడు.

ఆ తర్వాత అనుష్క శర్మ కూడా తన హెల్త్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో ఇటలీ వేదిక‌గా విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.

Story first published: Monday, January 11, 2021, 15:46 [IST]
Other articles published on Jan 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+