సచిన్‌లో చూసిందే వైభవ్ సూర్యవంశీలో కనిపించింది: మాజీ చీఫ్ సెలెక్టర్
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌లో చూసిన తెగువ తనకు వైభవ్ సూర్యవంశీలో కనిపించిందని తెలిపాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటుండటం తనను విపరీతంగా ఆకట్టుకుందన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. 13 ఇన్నింగ్స్‌లలో 44.54 సగటు, 236.32 స్ట్రైక్‌రేట్‌తో 579 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 53 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో భారత బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే కావడం గమనార్హం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ ఆటతీరుపై స్పందించిన కిరణ్ మోరే.. సచిన్‌తో పోల్చుతూ బుడ్డోడిని ఆకాశానికెత్తాడు. 'నేను తొలిసారి సచిన్ టెండూల్కర్‌ను చూసినప్పుడు అతను వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎలా ఎదుర్కొన్నాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే నాకు అర్థమైంది సచిన్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు అని. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతోంది. వైభవ్ కూడా చాలా ప్రత్యేకమైన ఆటగాడు. దేవుడే అతన్ని క్రికెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి పంపినట్లున్నాడు. వైభవ్‌ను తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడనివ్వండి.. దేశానికి గొప్ప పేరు తెస్తాడు.” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచ కప్‌లో వైభవ్ సూర్యవంశీ 7 మ్యాచ్‌ల్లో 439 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో 30 సిక్సర్లు బాది డెవాల్డ్ బ్రెవిస్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో 1280 పరుగులు చేసి 4 శతకాలు నమోదు చేశాడు.
ఈ అద్భుత ప్రదర్శన నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీని శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టుకు ఎంపిక చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

