Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ వదిలేసింది.. చరిత్ర సృష్టించాడు!

ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలేసిన యువ స్పిన్నర్ విజ్ఞేష్ పుతుర్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విజ్ఙేష్ పుతుర్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ టోర్నీలో భాగంగా బుధవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేళర తరఫున బరిలోకి దిగిన విజ్ఞేష్ పుతుర్.. ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికి సహా‌ క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తం 6 క్యాచ్‌లు అందుకొని వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు ఆరు క్యాచ్‌లు అందుకోవడం ఇదే తొలిసారి.

Released by Mumbai Indians Vignesh Puthur Creates History With Record Six Outfield Catches in List A Cricket

32 ఏళ్ల రికార్డ్ బద్దలు..

ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఓ ఆటగాడు ఐదు క్యాచ్‌లు అందుకోవడమే రికార్డు. కానీ 6 క్యాచ్‌లతో విజ్ఞేష్ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఈ క్రమంలో విజ్ఞేష్ పుతుర్.. జాంటీ రోడ్స్, బ్రాడ్ యంగ్, పీటర్ హాండ్‌స్కోంబ్, అరీన్ సంగ్మా, హ్యారీ బ్రూక్‌ల రికార్డు‌ను బద్దలు కొట్టాడు.

1993లో సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకోగా.. బ్రాడ్ యంగ్(2002), హాండ్‌స్కోంబ్(2023), అరీన్ సంగ్మా(2025), హ్యారీ బ్రూక్(2025) ఈ రికార్డ్‌ను సమం చేశారు. 32 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను విజ్ఞేష్ పుతుర్ తాజాగా 6 క్యాచ్‌ల పట్టి అధిగమించాడు.

కేరళ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో కేరళ 145 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగుల భారీ స్కోర్ చేసింది. విష్ణు వినోద్(102) సెంచరీ బాదగా.. బాబా అపరజిత్(64), రోహన్(94) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం త్రిపుర 36.5 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది. బాబా అపరజిత్(5/15) ఐదు వికెట్లు తీయగా.. విజ్ఞేష్ పుతుర్ ఒక వికెట్ పడగొట్టాడు.

వేలంలో రూ.30 లక్షలే

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున విజ్ఞేష్ పుతుర్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గాయంతో జట్టుకు దూరమైన అతన్ని ముంబై ఇండియన్స్ వేలానికి ముందు వదిలేసింది. వేలంలో తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో ఫ్రాంచైజీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ అతని కనీస ధర రూ.30 లక్షలకు తీసుకుంది.

Story first published: Thursday, December 25, 2025, 22:15 [IST]
Other articles published on Dec 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+