
టీ20 ప్రపంచకప్‌తో ఓవర్
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్‌లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్‌కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా చేరింది. అయితే అతని పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో అతని తర్వాత ఎవరు అన్న చర్చ ఇప్పుడే ప్రారంభమైంది.

ఆ సత్తా ద్రవిడ్‌కే ఉంది
రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్ రితేందర్ సింగ్ సోధి చెప్పాడు. రితేందర్ సింగ్ తాజాగా ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'రవిశాస్త్రి కోచ్‌గా మంచి విజయం సాధించాడు. ఇది మనం అంగీకరించాలి. అయితే అతని కాంట్రాక్ట్ త్వరలో ముగియబోతోంది. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్‌ను శ్రీలంకకు హెడ్ కోచ్‌గా పంపించారంటే.. అతడు తర్వాతి హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లేనని బోర్డు స్పష్టంగా చెప్పినట్లే. నిజానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్నది ద్రవిడ్‌కే' అని అన్నాడు. సోధి భారత్ తరఫున 18 వన్డేలు ఆడాడు.
India vs Srilanka: క్వారంటైన్ ముగిసే.. ఒకర్నొకరు కలుసుకొనేందుకు అవకాశం దొరికే! ఇదే అదునుగా!

జూలై 13 తొలి వన్డే
ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియాలు లంకకు వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications
