అమ్మతోడు భయ్యా.. సూర్య ఆడుతుంటే సుస్సు పడ్డది: ఇంగ్లండ్ పేసర్

బర్మింగ్‌హామ్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య ఆడిన విభిన్నమైన షాట్స్ తాను ఇప్పటివరకు చూడలేదని కొనియాడాడు. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117) మెరుపు సెంచరీ బాదగా.. టోప్లీ(3/22) పొదుపైన బౌలింగ్‌తో పాటు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆరంభంలోనే రిషభ్ పంత్(1), రోహిత్ శర్మ(11)లను పెవిలియన్ చేర్చిన టోప్లీ.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(28)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. శ్రేయస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు సూర్య 119 పరుగుల భాగస్వామ్యం అందించగా.. ఈ పార్టనర్‌షిప్‌ను టోప్లీ విడదీసాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఆ షాట్స్ నా జీవితంలో చూడలేదు..
అవార్డు అందుకునే సమయంలో హోస్ట్‌తో మాట్లాడిన టోప్లీ.. సూర్యను ఆకాశానికెత్తాడు. అతను ఆడిన ఆటకు భారత్ గెలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతని విభిన్నమైన షాట్లను క్రికెట్ చరిత్రలోనే తాను ఇప్పటివరకు చూడలేదన్నాడు. 'సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరుకు భారత జట్టు గెలవాల్సింది. అతను ఆడిన అద్భుతమైన షాట్స్‌ను నేను ఇప్పటి వరకు చూడలేదు. అతను ఆ షాట్స్ ఎలా ఆడాడని ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు.'అని టోప్లీ చెప్పుకొచ్చాడు.

పరుగులు కట్టడి చేయడమే..
ఇక తన వ్యక్తిగత ప్రదర్శనపై మాట్లాడుతూ.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం పట్ల సంతోషంగా ఫీలవుతున్నా. ఈ మ్యాచ్‌లో నా ప్రణాళికలకు నేను కట్టుబడి బౌలింగ్ చేసా. బ్యాటర్లు ఔటైనా చెలరేగినా.. పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీయడమే లక్ష్యంగా బంతులు సంధించా. ఆరంభంలోనే వికెట్లు తీయడం మా లక్ష్యం. అలా చేసినా సూర్య సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతని అసాధారణమైన షాట్లకు నా వద్ద మాటల్లేవ్. ఇక నేను ఫిట్‌గా ఉన్నా.. సమ్మర్‌లో క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నా.'అని టోప్లీ చెప్పుకొచ్చాడు.

సరిపోని సూర్య ప్రతాపం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే (3/22) 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెల్చుకోగా... భువనేశ్వర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' పురస్కారం లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications