For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Aus: పంత్ బేబీ సిట్టర్ , తాత్కలిక సారథి పైన్.. రోహిత్ ఐపీఎల్ ఆఫర్.. గత టూర్‌లోని స్పైసీ మూమెంట్స్!

Recalling spicy moments from India-Australia Tests in 2018-19

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న భారత్-ఆస్ట్రేలియా టెస్ట్‌‌ సిరీస్ మరో రెండు రోజుల్లో మొదలవ్వనుంది. గురువారం జరిగే పింక్‌‌ బాల్ మ్యాచ్‌‌తో ఈ మెగా సిరీస్‌‌ షురూ అవుతుంది. ఇరు జట్ల మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ హైఓల్టెజ్ సమరాన్ని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్‌లో సెంచరీలు, వికెట్లే కాదు.. ఆటగాళ్ల మధ్య జరిగే సంభాషణలు.. మైదానంలో చోటు చేసుకునే ఘటనలు ఆకట్టుకుంటాయి.

ఇలా గత పర్యటనలో( 2018-2019)లోనూ అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. పైగా ఈ పర్యటనలోనే భారత్ తొలిసారి ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి సిరీస్‌ సొంతం చేసుకుంది. అలాగే పంత్-పైన్ మధ్య జరిగిన సరదా సంభాషణ, రోహిత్ ఐపీఎల్ ఆఫర్ ఇలా అనేక విషయాలు సిరీస్‌పై ఆసక్తినిరేకిత్తించాయి. ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం.

 బ్యాట్‌తోనే విరాట్ ఆన్సర్!

బ్యాట్‌తోనే విరాట్ ఆన్సర్!

ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ప్రత్యర్థి ఆసీస్ కూడా విరాట్‌ను ఔట్ చేస్తే పనైపోతుందనే విధంగా ప్రణాళికలు రచిస్తుంది. ఆ క్రమంలోనే తమ మాటలతో రెచ్చగొడుతుంది. మైదానంలో తమ చేష్టలతో కవ్విస్తుంది. ఈ క్రమంలోనే గత పర్యటనలో విరాట్‌ను ఎలా ఔట్ చేయాలనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే కోహ్లీ కూడా ఫస్ట్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 34 విఫలమయ్యాడు. కానీ పుజారా మాస్టర్ క్లాస్‌తో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ను ఔట్ చేసిన కమిన్స్ ఈ సిరీస్‌లో అతన్ని సెంచరీ చేయనియ్యమని కామెంట్ చేశాడు.

ఇక సెకండ్ టెస్ట్‌లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్(123) సెంచరీతో చెలరేగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ తర్వాత ఎలాంటి సంబరాలు చేసుకోని విరాట్.. తన బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు చూపిస్తూ.. ‘నేను మాట్లాడను.. నా బ్యాటే సమాధానమిస్తుంది'అని సైగ చేస్తూ కమిన్స్ వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానమిచ్చాడు.

విరాట్ కోహ్లీ X టిమ్ పైన్..

విరాట్ కోహ్లీ X టిమ్ పైన్..

పెర్త్ టెస్ట్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నోటికి పనిచెప్పారు. పైన్-ఉస్మాన్ ఖావాజా కీలక భాగస్వామ్యంపై విరాట్ కామెంట్ చేయగా.. పైన్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. దాంతో అంపైర్ ఇద్దరి కెప్టెన్లను వారించాడు. కోహ్లీని పెద్ద తల అని పైన్ పిలవగా.. ‘నిన్న ఓడి ఈ రోజు ఎందుకు కూల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు'అని పైన్‌ను కోహ్లీ ప్రశ్నించాడు. ఇంతలో అంపైర్.. ‘మీరు కెప్టెన్లు అయ్యా' అంటూ వారించాడు. దానికి పైన్ మాట్లాడుతూ..‘మేం కేవలం మాట్లాడుకుంటున్నాం. తిట్టుకోవడం లేదు. విరాట్‌ను ప్రశాంతంగా ఉంచు'అని బదులిచ్చాడు. అనంతరం మురళీ విజయ్ బ్యాటింగ్ చేస్తుండగా..‘విజయ్.. అతను మీకు కెప్టెన్ అని తెలుసు. కానీ అతనంటే మీకు కూడా ఇష్టం ఉండదని తెలుసు'అని పైన్ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్స్‌లో రికార్డు అయ్యాయి.

రోహిత్ శర్మ ఆఫర్..

రోహిత్ శర్మ ఆఫర్..

ఇక పైన్ ప్రతీమ్యాచ్‌లో తన నోటికి పనిచెప్పాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. సహచర ఆటగాడు ఫించ్‌తో ‘హిట్ మ్యాన్ సిక్స్ కొడితే నేను రాయల్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారుతా. ఐపీఎల్‌లో నువ్వు అన్ని జట్లకు ఆడావు? కదా?'అని ప్రశ్నించాడు. దానికి ఫించ్ ఒక బెంగళూరు తప్పా అన్ని జట్లకు ఆడానన్నాడు. బెంగళూరు ఒక్కదానికే ఆడలేదా? అని పైన్ ప్రశ్నించాడు. ఈ సంభాషణపై అజింక్యా రహానేతో మాట్లాడిన హిట్ మ్యాన్.. ఈ టెస్ట్‌లో పైన్ సెంచరీ చేస్తే వేలంలో ముంబై ఇండియన్స్ జట్టుకు తీసుకుంటామని ఆఫర్ ఇచ్చాడు. ఇక సెంచరీ చేయని పైన్‌ను ముంబై ఇండియన్స్ కూడా ట్రోల్ చేసింది. మిషన్ విఫలం అంటూ కామెంట్ చేసింది.

పంత్ బేబీ సిట్టర్.. పైన్ టెంపరరీ కెప్టెన్..

పంత్ బేబీ సిట్టర్.. పైన్ టెంపరరీ కెప్టెన్..

బాక్సింగ్ డే టెస్ట్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తుండగా పైన్ అతన్ని పదే పదే విసిగించాడు. ‘పంత్.. ధోనీ రాకతో వన్డే జట్టులో చోటు కోల్పోతావ్. హర్రికేన్స్‌కు బ్యాట్స్‌మెన్ అవసరం ఉంది. బీబీఎల్ ఆడుతావా?. ఈరోజు రాత్రి ఇంట్లో ఉండి మా పిల్లల్ని ఆడిస్తావా..? నేను నా భార్యతో కలిసి సినిమాకి వెళ్తాను' అని పైన్ నోటికి పనిచెప్పాడు. ఇక పైన్ నోటి దురుసుకు పంత్ గట్టి సమాధానం ఇచ్చాడు. టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన నోటికి పనిచెప్పాడు. ‘టిమ్ పైన్ టెంపరరీ, యాక్సిడెంట్ కెప్టెన్ అంటూ సెటైర్లు పేల్చాడు.' ఇక ఈ మ్యాచ్ తర్వాత టిమ్ పైన్ పిల్లల్ని నిజంగానే రిషబ్ పంత్ ఆడిస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ బేబీ సిట్టర్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Story first published: Tuesday, December 15, 2020, 14:14 [IST]
Other articles published on Dec 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+