
ఇద్దరూ సెట్ అవ్వరనే..
తాను టీ20 కెప్టెన్సీ వదులుకుంటానని ప్రపంచకప్‌కు ముందే కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. కానీ, వన్డే సారథ్యం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్ వరకూ కెప్టెన్‌గా ఉండాలన్నది తన ఆలోచనగా కనిపించింది. కానీ, బోర్డు ఉన్నట్టుండి రోహిత్‌ను వన్డే కెప్టెన్ చేయడానికి కారణం కోహ్లీ టీ20 సారథ్యం వదులుకోవడమే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండటాన్ని బీసీసీఐ, సెలెక్టర్లు ఇష్టపడటం లేదు.
పైగా, వన్డే, టీ20లకు దాదాపు ఒకే సెట్ ప్లేయర్లుంటారు. కానీ, ఈ రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. ప్లేయర్లు ఎవరికి రిపోర్ట్ చేయాలనే విషయంలో అనవసర సమస్యలు రావొచ్చు. దీన్ని గ్రహించే బోర్డు, సెలక్టర్లు వైట్ బాల్‌కు ఒకరు, రెండ్ బాల్‌కు మరొకరు కెప్టెన్‌గా ఉండాలని నిర్ణయించారు. పైగా, 2023 ప్రపంచకప్ దృష్ట్యా.. కెప్టెన్‌గా రోహిత్‌కు తగిన సమయం ఇవ్వాలని భావించారు.

ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడం..
కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లీకి సూపర్ రికార్డ్ ఉంది. తను కెప్టెన్సీ చేసిన 95 మ్యాచ్‌ల్లో భారత్ 65 మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం 27 సార్లే ఓడింది. కానీ, తన హయాంలో భారత్ ఒక్క ఐసీసీ టైలిల్ కూడా గెలవలేదు. ధోనీ వారసుడిగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీ టీమ్‌లో పవర్‌ఫుల్ పర్సన్‌గా ఎదిగాడు. అయితే ధోనీ మాదిరిగా తన టీమ్ మేట్స్‌కు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
అదే సమయంలో ఓ లీడర్‌గా మిగతావాళ్లపై పూర్తిస్థాయి నమ్మకం ఉంచడం లేదనే అపవాదు కూడా అతనిపై ఉంది. దాంతో, టీమ్‌లో తమ ప్లేస్‌పై ప్లేయర్లలో అభద్రతా భావం ఏర్పడింది. కొంతకాలం అద్భుతంగా ఆడిన ప్లేయర్.. ఫామ్ కోల్పోతే కోహ్లీ అతనికి అండగా నిలవడం లేదట. ఇందుకు కుల్దీప్ యాదవ్‌ను ఉదాహరణగా చెబుతున్నారు.

ఐపీఎల్ వైఫల్యం..
ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా బెంగళూరుకు ఒక్క కప్పు కూడా అందించలేకపోవడం, మరోవైపు రోహిత్ సారథ్యంలో ముంబై ఐదుసార్లు విజేతగా నిలవడంతో కోహ్లీ నాయకత్వ లక్షణాలను ప్రశ్నార్థకం చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌గా భీకర ఫామ్‌తో దూసుకెళ్లినంత కాలం కోహ్లీని కెప్టెన్‌గానూ ఎవరూ ప్రశ్నించలేకపోయారు.
కానీ గత రెండేళ్లలో ఫామ్ దెబ్బ తినడంతో.. విరాట్ కెప్టెన్సీపై విమర్శలు, రోహిత్‌కు కనీసం టీ20ల్లో అయినా సారథ్యం అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. పరిస్థితిని అర్థం చేసుకుని టీ20 ప్రపంచకప్ అనంతరం ఈ ఫార్మాట్లో సారథ్యం నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2023 ప్రపంచకప్ వరకు వన్డేల్లో సారథిగా కొనసాగాలని అతను ఆశించినా... టీ20 ప్రపంచకప్‌లో భారత్ చిత్తుగా ఓడటం.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేసింది.

రవిశాస్త్రి చెప్పినా..
అదే టైమ్‌లో జట్టులోని జూనియర్స్‌కు రోహిత్ శర్మ పెద్దన్నలా హెల్స్ చేసేందుకు ముందుకు రావడంతో అందరూ అతనికి దగరయ్యారు. ఇక తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన చివర్లో రవిశాస్త్రితో కోహ్లీకి పడలేదని ప్రచారం జరుగుతోంది.
అలాగే, పెద్ద మ్యాచ్‌ల్లో అతను తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు బోల్తా కొట్టాయి. ఇలా చాలా ప్రతికూలతలు ఉండటంతో విరాట్ కోహ్లీ తప్పించడమే మంచిదని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ శకం ముగియగా.. ఇప్పుడు రోహిత్ శకం షురూ అయింది.


Click it and Unblock the Notifications
