
వేటుకు కారణం ఇదే..
ఇక హైదరాబాద్ అనూహ్య నిర్ణయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టుకు ఎంతో చేసిన డేవిడ్ వార్నర్‌ను ఇంతలా అవమానపరచడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై వేటు వేయడం వెనుక సన్‌రైజర్స్ పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చిన వార్నర్.. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌ల్లో193 పరుగులు చేయగా.. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ దూకుడుగా మాత్రం ఆడలేకపోయాడు. ఢిల్లీతో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి బంతులను వృథా చేసి, షార్ట్ రన్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఆ వెంటనే చెన్నైతో స్లో బ్యాటింగ్‌తో చికాకు తెప్పించాడు. ఈ తరహా ఆటతో వార్నర్ జట్టుకు భారంగా మారడని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

తుది జట్టులో చోటు గల్లంతు..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన ప్రకటనలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్‌లో కూడా మార్పులుంటాయని పేర్కొంది. అంటే డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో చోటు ఉండదనే విషయాన్ని పరోక్షంగా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. వార్నర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో మరో ఓవర్‌సీస్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. అంతేకాకుండా పిచ్ పరిస్థితులకు తగ్గట్లు ఓవర్‌సీస్ బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవచ్చని భావించింది.

జాసన్ రాయ్‌కు లైన్ క్లియర్..
ఇక వార్నర్ సారథ్యంపై వేటు వేసిన నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయల్‌కు లైన్ క్లియర్ అయింది. వార్నర్ స్థానంలో అతనికి చోటు దక్కే అవకాశం ఉంది. బెయిర్ స్టో-జాసన్ రాయ్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరూ రాణిస్తే టీమ్ బ్యాటింగ్ బలహీనతను అధిగమించవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ ఆల్‌రౌండర్ అవసరమైతే జాసన్ హోల్డర్ లేదా మహ్మద్ నబీలను జట్టులోకి తీసుకోవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ టీమ్ ప్రకటన చూస్తుంటే తదుపరి మ్యాచ్ తుది జట్లలో వార్నర్‌కు అవకాశం దక్కడం కష్టంగానే భావిస్తోంది.

దెబ్బ తీస్తున్న వార్నర్ వైఫల్యం..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2016లో కెప్టెన్‌గా టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గానూ తిరుగులేని రికార్డులతో కొనసాగుతున్న వార్నర్.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. ప్రతీ సీజన్‌లో బ్యాటింగ్ విభాగాన్ని ఒంటి చేత్తో నడిపించిన వార్నర్.. ఈ సీజన్ విఫలమవ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేన్ విలియమ్సన్ ఇప్పటి వరకూ ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా.. 108 పరుగులు చేశాడు. ఇందులో ఒక బాధ్యతాయుత హాఫ్ సెంచరీ ఉంది.


Click it and Unblock the Notifications
