
న్యూఢిల్లీ: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ జట్టులో అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం కల్పించడం అందర్నీ విస్మయపరిచింది. అయ్యర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి మూడేళ్లు కావస్తోంది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విమారిని కాదని అయ్యర్‌ను తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి బలమైన కారణం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ ద్రవిడ్ తన మాస్టర్ ప్లాన్‌తో హనుమ విహారిని పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ముందస్తు ఆలోచన నేపథ్యంలోనే విహారిని పక్కనపెట్టిన్లు అర్థమవుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం భారత్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాకు వెళ్లే భారత్-ఏ జట్టులో పృథ్వీషాతో పాటు హనుమ విహారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోని రాణిస్తే.. టీమిండియా సీనియర్ టీమ్‌లోకి తీసుకోవాలని, అప్పుడు జట్టుకు లాభపడుతుందని ద్రవిడ్ భావించాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
టీమిండియా భవిష్యత్తు నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్‌ను టెస్ట్ జట్టులోకి తీసుకున్నారని, మిడిలార్డర్ బ్యాకప్‌గా సిద్దం చేసేందుకు ఇప్పటి నుంచే అతనికి సానబెట్టాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విహారి ఆల్ట్రా డిఫెన్స్ బ్యాటింగ్ స్టైల్ రహానె, పుజారా మాదిరిగా ఉంటుందని, మిడిలార్డర్‌లో వైవిధ్యం కోసం శ్రేయస్ అయ్యర్‌కు చాన్స్ ఇచ్చారని సెలక్షన్ కమిటీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ గైర్హాజరీలో జట్టుకు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అవసరం లేదని, ఆ లోటు అశ్విన్, జడేజా తీర్చగలరని టీమ్ భావించినట్లు తెలుస్తోంది.
'రాహుల్ ద్రవిడ్ సూచనల నేపథ్యంలోనే భారత్ ఏ జట్టు ఎంపిక జరిగింది. హనుమ విహారిని సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయడం వెనుక ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌లో భాగంగానే హనుమ విహారి, పృథ్వీ షాలను భారత్-ఏ జట్టుకు ఎంపిక చేసింది. ఈ ఇద్దరు అక్కడి పరిస్థితుల్లో రాణిస్తే భారత్ సౌతాఫ్రికా పర్యటన టీమ్‌లో చోటు దక్కించుకుంటారు. అప్పుడు టీమ్‌కు అడ్వాంటేజ్ అవుతోంది. ఇక భారత్‌కు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే అశ్విన్, జడేజా అప్‌ది ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలరు'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.