Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rajat Patidar: ఆర్‌సీబీ బ్యాటర్ విధ్వంసం.. ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రజత్ పటీదార్..ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీ బాదాడు.

29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

RCB s Rajat Patidar Slams Unbeaten 66 takes MP to SMAT final with seven-wicket win over Delhi

ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. అనూజ్ రావత్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), ప్రియాన్ష్ ఆర్య(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్(2/12) రెండు వికెట్లు తీయగా.. కుమార్ కార్తీకేయ, ఆవేశ్ ఖాన్, త్రిపురేష్ సింగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం మధ్యప్రదేశ్.. రజత్ పటీదార్ విధ్వంసంతో 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 152 పరుగులు చేసింది. రజత్ పటీదార్‌తో పాటు హర్‌ప్రీత్ సింగ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా.. హిమాన్షు చౌహన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్‌.. ముంబైతో తలపడనుంది.

ఈ టోర్నీలో రజత్ పటీదార్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మధ్యప్రదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. అత్యధిక సిక్స్‌లు, బౌండరీలు బాదిన ప్లేయర్‌గానూ నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంపై ఆ జట్టు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లపై రజత్ పటీదార్ చెలాయిస్తున్న ఆధిపత్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్‌సీబీ కూడా రజత్ పటీదార్‌ను కొనియాడుతూ ట్వీట్ చేసింది.

Story first published: Friday, December 13, 2024, 20:26 [IST]
Other articles published on Dec 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+