
కీపింగ్ అంటే ఇది..
ఇక ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) 2021 వేలంలో మహ్మద్ అజారుద్దీన్‌ను ఆర్‌సీబీ అతని కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపు సెంచరీతో అందరిని ఆకట్టుకున్న అజారుద్దీన్.. ఆర్‌సీబీకీ సొంతమయ్యాడు. ప్రస్తుతం కేసీఏ ఈగల్స్ టీమ్‌కు సారథ్యం వహిస్తున్న అజారుద్దీన్.. కేసీఏ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైమరిపించే కీపింగ్‌తో ఔరా అనిపించాడు. సూపర్ డైవ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. కీపింగ్ అంటే ఇలా ఉండాలని చెబుతూ చూపించే విధంగా ప్రత్యర్థిని పెవిలియన్ చేర్చాడు.
కళ్లు చెదిరే డైవ్..
క్విక్ సింగిల్ తీయాలని భావించిన ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అజారుద్దీన్ సూపర్ కీపింగ్‌కు బిత్తరపోయారు. నిరాశగా పెవిలియన్ చేరారు. అయితే బ్యాట్స్‌మన్ కవర్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ బంతిని వెంటనే వికెట్ల వైపు విసిరాడు. కానీ బంతి వికెట్లకు దూరంగా వెళ్తుండటం గమనించిన అజారుద్దీన్ సూపర్ డైవ్‌తో రెండు చేతులతో బంతిని ఒడిసి పట్టుకొని, ఎడమ చేతితో వికెట్లను గీరాటేశాడు. ఇదంతా రెప్పపాటు టైమ్‌లో అతను గాల్లో ఉండగానే జరిగిపోవడం విశేషం. ఇక బ్యాట్స్‌మన్ క్రీజుకు చాలా దూరంలో ఉండటంతో అంపైర్ ఔటిచ్చాడు.

ఆనందంలో ఆర్‌సీబీ..
ఇక కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అజారుద్దీన్ అదరగొట్టాడు. 43 బంతుల్లో 69 పరుగులు చేయడంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఏ ఈగల్స్ 167 పరుగులు చేయగలిగింది. ఇక ఈ యువ బ్యాట్స్‌మన్ సూపర్ ఫామ్‌పై ఆర్‌సీబీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇదే జోరును కొనసాగిస్తే వచ్చే సీజన్‌లో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జట్టు బలం కూడా పెరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

కౌంట్ డౌన్ స్టార్ట్..
కాగా, ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 6 వేర్వేరు వేదికల్లో జరగనుండగా.. ప్రతీ జట్టు 4 వేదికల్లో ఆడతాయి. ఈ సారి ఐపీఎల్‌లో ఏ టీమ్‌కు హోమ్ గ్రౌండ్‌లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ 2020 మాదిరిగానే మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి క్వాలిఫయర్స్ మే 25, రెండో క్వాలిఫయర్స్ మ్యాచ్ 28 తేదీల్లో జరుగనున్నాయి. ఎలిమినేటర్ మే 26న, ఫైనల్ మ్యచ్ మే 30న జరగనుంది.


Click it and Unblock the Notifications












