IPL 2025: చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ.. ఈ ఒక్క ఏడాదే ఎన్నో ఆల్‌టైమ్ రికార్డ్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కల నెరవేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ అలుపెరగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. కోట్లాది మంది అభిమానుల బెంగ తీరింది. ఎంత మంచి జట్టుతో ఆడినా.. ఎంత మంది మేటి ఆటగాళ్లతో బరిలో నిలిచినా దక్కని టైటిల్.. 18వ ప్రయత్నంలో ఆర్‌సీబీ ఒడిలోకి వచ్చి చేరింది. టైటిల్‌తో పాటు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అనేక అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ సాధించిన ఘనతలు..
- 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీకి టైటిల్
- 9 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకుంది
- ఆర్‌సీబీ చరిత్రలోనే అత్యధిక పరుగుల(228) లక్ష్యాన్ని చేధించింది.
- 9 ఏళ్ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచింది.
- 17 ఏళ్ల తర్వాత చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆర్‌సీబీ విజయం సాధించింది.
- 10 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఆర్‌సీబీ ఓడించింది.
- 7 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్‌సీబీ ఓడించింది.
- 6 ఏళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించింది.
- ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓడించింది
- లీగ్ దశలో ఇతర మైదానల్లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్టుగాను ఆర్‌సీబీ నిలిచింది.
- చెపాక్‌లో సీఎస్‌కేపై 50 పరుగుల భారీ తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది.
- ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఆర్‌సీబీ జట్టులోని 10 మంది ఆటగాళ్లు 50+ పరుగులు సాధించారు.
- తొలిసారిగా ఒకే సీజన్‌లో 9 మంది ఆర్‌సీబీ ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు.
- ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ప్రత్యర్థి జట్టును 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.
- ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా(10 ఓవర్లలోపు) లక్ష్యాన్ని చేధించిన జట్టుగానూ ఆర్‌సీబీ రికార్డ్ సాధించింది.
- ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒక జట్టు(పంజాబ్ కింగ్స్)ను ఆర్‌సీబీ మూడు సార్లు ఓడించింది.
- ఐపీఎల్ చరిత్రలోనే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో తొలిసారి టాప్-7 బ్యాటర్లు 15 ప్లస్ రన్స్ చేశారు.
Story first published: Wednesday, June 4, 2025, 16:26 [IST]
Other articles published on Jun 4, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications