ఆర్‌సీబీ బ్యాటర్ సంచలన బ్యాటింగ్.. 68 బంతుల్లోనే శతకం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్ రజత్ పటీదార్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రతీష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్ పటీదార్.. హర్యానాతో జరుగుతున్న మూడో రౌండ్‌లో 68 బంతుల్లో శతకం సాధించాడు. తద్వారా అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పటీదార్.. 68 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకొని మధ్యప్రదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ బ్యాటర్ నమన్ ఓజా రికార్డును అధిగమించాడు. 2015లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో నమన్ ఓజా 69 బంతుల్లో శతకం సాధించాడు.

ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ రిషభ్ పంత్ పేరిట ఉంది. అతను 48 బంతుల్లోనే శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్ శక్తీ సింగ్ 1990లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో శతకం సాధించాడు. అయితే ఈ శతకాన్ని రికార్డుల్లోకి ఎక్కలేదు. స్కోర్ కార్డ్‌కు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఈ శతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు.
రజత్ పటీదార్ విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 15 పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం హర్యానా 440 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి 132 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 48 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. రజత్ పటీదార్(102 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 159) సెంచరీతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications