Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021:'పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నా..ఏదో ఒకరోజు నా కొడుకు టీమిండియాకు ఆడతాడు'

RCB vs SRH: Umran Malik father Abdul Malik hopes that one day his son plays for Team India
IPL 2021 : ‘We Hope Umran Malik Plays For India One Day’ – Umran Malik's Father || Oneindia Telugu

జమ్మూ కశ్మీర్‌: గత ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున జమ్మూ కశ్మీర్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల ఉమ్రాన్‌ తన మొదటి బంతినే 146 కిలోమీటర్ల వేగంతో సందించాడు. ఆపై రెండు బంతులను 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఓ బంతిని 151.03 కి.మీ. వేగంతో బంతి విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు.

దాంతో ఐపీఎల్ 2021లో అత్యంత వేగంగా బంతిని విసిరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇక ఆర్‌సీబీపై గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బంతిని విసిరి ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఉమ్రాన్‌ మాలిక్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ

కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ

21 ఏళ్ల జమ్మూ కశ్మీర్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ది సాధారణ కుటుంబం. ఇతని తండ్రి అబ్దుల్ మాలిక్‌ కూరగాయలు, పండ్ల వ్యాపారి. తమ ప్రాంతంలో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కుమారుడుకి చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఉండడంతో.. కాదనలేకపోయాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ చదువు, క్రికెట్ సాధనకు ఎంతో ఖర్చు అయినా భరించాడు. ఉమ్రాన్‌ కూడా ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు.

దేశవాళీల్లో సత్తాచాటడంతో ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. తన కుమారుడు ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఉమ్రాన్‌ తండ్రి అబ్దుల్ మాలిక్‌ తాజాగా పేర్కొన్నారు.

RCB vs SRH: ఆ ప్రణాళికతోనే ఏబీ డివిలియర్స్​ను కట్టడి చేశా: భువనేశ్వర్

నన్ను గర్వపడేలా చేశాడు

నన్ను గర్వపడేలా చేశాడు

'నా కుమారుడికి చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి. ప్రొఫెషనల్ క్రికెటర్‌ కావాలని ఎప్పుడూ కలలు కనేవాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేయడంతో చాలా సంతోషించాము. మ్యాచ్‌ జరుగుతున్నసేపు టీవీనే చూస్తూండేవాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నాడు. నాకు, నా భార్యకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇది మమూలు విషయం కాదు. మాది చాలా పేద కుటుంబం.

నేను పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నా కుమారుడు నన్ను గర్వపడేలా చేశాడు. మా ఆనందానికి ఇపుడు అవధులు లేవు. ఉమ్రాన్‌ని లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కూడా అభినందించాడు. ఏదో ఒకరోజు అతడు టీమిండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది' అని అబ్దుల్ మాలిక్‌ ధీమా వ్యక్తం చేశారు.

గంటకు 153 కిలోమీటర్ల వేగం

గంటకు 153 కిలోమీటర్ల వేగం

బుధవారం అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నిలిచాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో భాగంగా తొమ్మిదో ఓవర్‌ నాలుగో బంతిని ఉమ్రాన్‌ గంటకు 153 కిలోమీటర్ల వేగంతో విసిరాడు.

ఆ బంతికి ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్‌ నోర్జ్‌ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున ఆడుతున్న నోర్జ్‌.. ఐపీఎల్ 2020లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడు.

Story first published: Thursday, October 7, 2021, 15:13 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+