For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH: ఆ ప్రణాళికతోనే ఏబీ డివిలియర్స్​ను కట్టడి చేశా: భువనేశ్వర్

RCB vs SRH: Bhuvneshwar Kumar Reveals Plan Against AB de Villiers in last over
IPL 2021 : Bhuvneshwar Kumar Reveals His Game Plan Against AB De Villiers || Oneindia Telugu

అబుదాబి: దక్షిణాఫ్రికా మాజీ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసక బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటర్మెంట్ ఇచ్చి మూడు సంవత్సరాలు దాటినా.. అదే ఫామ్ కనబరుస్తున్నాడు. పలు లీగుల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడంటే.. పరుగుల వరదే. ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడు. బంతి ఎక్కడ పడినా.. బౌలర్ ఎవరైనా.. తన బ్యాటింగ్ టెక్నిక్‌తో ఏబీ అలవోకగా సిక్స్ కొట్టేయగలడు. మైదానం నలు మూలలా పరుగులు చేయగలడు. అలాంటి ఆటగాడిని నిలువరించాలంటే చాలా కష్టం. ఇక ఛేదనలోని చివరి ఓవర్లో అయితే మరీమరీ కష్టం. అలాంటి ఏబీని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కట్టడి చేశాడు.

అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా వికెట్లు పడినా.. షాబాజ్‌ అహ్మద్ (14; 9 బంతుల్లో 2×4), ఏబీ ఏబీ డివిలియర్స్‌ (19 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 1×6) బెంగళూరు జట్టును విజయానికి చేరువ చేశారు. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో జాసన్ హోల్డర్‌ 19వ ఓవర్లో షాబాజ్‌ను ఔట్‌ చేయడమే కాక.. 5 పరుగులే ఇచ్చి ఆర్‌సీబీని తీవ్ర ఒత్తిడిలో పడేశాడు. ఇక చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగే ఇచ్చాడు. నాలుగో బంతికి ఏబీ సిక్స్‌ బాదడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. ఇక మ్యాచ్ బెంగళూరుడే అనుకున్నారు. కానీ భువీ మాయ చేశాడు. తాను అనుకున్న ప్రణాలికను అమలు చేశాడు. తర్వాతి రెండు బంతులకు ఏబీ షాట్లు ఆడలేకపోవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.

భువనేశ్వర్ కుమార్ వేసిన 20వ ఓవర్ చివరి రెండు బంతులు మ్యాచుకు హైలట్ అనే చెప్పాలి. ఒకే తరహాలో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వైడ్ యార్కర్స్ రూపంలో భువీ సంధించగా.. సిక్స్‌గా హిట్ చేయడంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విఫలమయ్యాడు. వాస్తవానికి ఏబీడీకి ఉన్న పవర్‌కి ఆ బంతుల్ని స్టాండ్స్‌లోకి కొట్టేయగలడు. కానీ భువీ ఆ రెండు బంతుల్నీ గంటకి 134, 133కిమీ వేగంతో విసరగా.. పేస్ ఆఫర్ చేయకపోవడంతో ఏబీకి కష్టమైపోయింది. ఐదవ బంతికి పరుగేమీ చేయని డివిలియర్స్.. ఆరో బంతికి సింగల్ తీశాడు. ఆఖరి ఓవర్‌లో ఏబీని కట్టడి చేసిన విధానం గురించి మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ తెలిపాడు.

'నా చేయి బాగా తిరిగింది. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో కాస్త భిన్నంగా ఆలోచించాలి. ఫైనల్ ఓవర్‌లో నేను ఒత్తిడికి గురవాలేదని చెప్పడం అబద్దమే అవుతుంది. ఏబీకి వైడ్​ యార్కర్లు వేసేందురు ప్రయత్నించా. మధ్యలో స్టంప్స్ దిశగా యార్కర్​ వేసి ఆరు పరుగులు సమర్పించుకున్నా. అందుకే వైడ్​ యార్కర్లు వేయడమే సరైన నిర్ణయం అని భావించా. మళ్లీ వైడ్ యార్కర్స్ సంధించి ఫలితం రాబట్టా. దుబాయ్​లోని మూడు మైదానాల్లో మేం పెద్దగా స్కోరు నమోదు చేయలేదు. కానీ ఈ మ్యాచ్​లో 10 నుంచి 15 పరుగులు తక్కువే చేశామని అనిపించింది' అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 7, 2021, 14:05 [IST]
Other articles published on Oct 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+