ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లు తేలిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధాటికి ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల అటాకింగ్ గేమ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్‌సీబీ బౌలర్లు.. పోటాపడి పరుగులు ఇచ్చుకున్నారు.
బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యారు. విల్ జాక్స్, రిస్ టోప్లీ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాఖ్ అందరూ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్ హైలైట్స్‌ను తలపించింది. ప్రతీ ఓవర్‌లో భారీ సిక్సర్లతో చెలరేగారు.

ఆర్‌సీబీ చెత్త బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న ట్రావిస్ హెడ్ మరో 19 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతని ధాటికి 11.2 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) ఫెర్గూసన్ ఔట్ చేశాడు.

ఇక ఆర్‌సీబీ చెత్త బౌలింగ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'రేయ్ ఎవర్రా మీరంతా.. పరుగులు ఇవ్వడంలో పోటీ పడుతున్నారు..!'అని కామెంట్ చేస్తున్నారు. ఇది మ్యాచ్? లేక హైలైట్స్? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్‌ను ఆర్‌సీబీ పక్కనపెట్టింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఉన్న బౌలర్ల కంటే ఈ ఇద్దరూ ఎంతో నయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.