సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్.. ఓవరాల్‌గా 39 బంతుల్లోనే శతకం సాధించాడు. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీర విహారం చేశాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(30), యూసఫ్ పఠాన్(37), డేవిడ్ మిల్లర్(38), ట్రావిస్ హెడ్(39) కన్నా ముందున్నారు.

ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 7.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ను ధాటింది. అభిషేక్ శర్మ(34)తో తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించిన ట్రావిస్ హెడ్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. లాకీ ఫెర్గూస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఉన్నంత సేపు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. గతంలో ఆర్‌సీబీకే ప్రాతినిథ్యం వహించిన ట్రావిస్ హెడ్.. ఆ జట్టు తరఫునే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేక జట్టుతో పాటు లీగ్ కూడా దూరమయ్యాడు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటి మరోసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ట్రావిస్ హెడ్.. తన పాత జట్టుపైనే కనికరం లేకుండా చెలరేగాడు.
ట్రావిస్ హెడ్‌కు తగ్గట్టుగా.. క్లాసెన్, మార్క్‌రమ్‌తో చెలరేగడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. సన్‌రైజర్స్ బ్యాటర్ల ధాటికి ఆర్‌సీబీ బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల అటాకింగ్ గేమ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్‌సీబీ బౌలర్లు.. పోటాపడి పరుగులు ఇచ్చుకున్నారు.
బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యారు. విల్ జాక్స్, రిస్ టోప్లీ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాఖ్ అందరూ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్ హైలైట్స్‌ను తలపించింది. ప్రతీ ఓవర్‌లో భారీ సిక్సర్లు నమోదయ్యాయి.