Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తమ పేరిటే ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత మెరుగుపరుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 288 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67), ఎయిడెన్ మార్క్‌రమ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

RCB vs SRH Henrich Klaasen maul RCB bowling SRH post World Record total in IPL 2024

ఆర్‌సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదే సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగుల రికార్డ్ నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డ్‌ను మరింత మెరుగుపరుచుకుంది.

ట్రావిస్ హెడ్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్.. వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. పోటా పడి సిక్స్‌లు బాదింది.

ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో 7.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 100 పరుగులు చేసింది. అభిషేక్ శర్మను రీస్ టోప్లీ ఔట్ చేసినా.. క్లాసెన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ చెలరేగాడు. భారీ సిక్స్‌‌లు బాది 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అతన్ని ఫెర్గూసన్ ఔట్ చేసినా.. క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్‌తో చెలరేగాడు.

RCB vs SRH Henrich Klaasen maul RCB bowling SRH post World Record total in IPL 2024

కొంపముంచిన యశ్ దయాల్..
23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అతను.. బంతిని చిన్నస్వామి స్టేడియం బయటకు పంపించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో అతను ఔటైనా.. అబ్దుల్ సమద్, మార్క్‌రమ్ ఆ జోరును కొనసాగించారు. యశ్ దయాల్ బౌలింగ్‌లో సమద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఔటవ్వగా.. నోబాల్ కావడంతో బతికిపోయాడు.ఈ అవకాశంతో చెలరేగిన అతను భారీ సిక్స్‌లతో చెలరేగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ అందించాడు.

Story first published: Monday, April 15, 2024, 21:27 [IST]
Other articles published on Apr 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+