Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: క్లాసెన్ కాక ఊర మాస్ బ్యాటింగ్.. కొడితే స్టేడియం బయటపడ్డ బంతి! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రీచ్ కాస్లెన్ ఊర మాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ కాక సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌‌లో క్లాసెన్ కాక కొట్టిన ఓ సిక్స్‌కు బంతి స్టేడియం బయట పడింది. 106 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్సర్‌.. ఈ సీజన్‌లోనే భారీ సిక్సర్‌గా నమోదైంది. ఈ సిక్సర్‌తో ఈ సీజన్‌లో భారీ సిక్సర్ బాదిన నికోలస్ పూరన్, వెంకటేశ్ అయ్యర్ సరసన హెన్రీచ్ క్లాసెన్ నిలిచాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే 106 మీటర్ల సిక్సర్ బాదారు.

RCB vs SRH Heinrich Klaasen Hits Longest Six in IPL 2024

ఈ సీజన్‌లో భారీ సిక్సర్లు బాదిన జాబితాలో క్లాసెన్, పూరన్, వెకంటేశ్ అయ్యర్ 106 మీటర్ల సిక్సర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు బ్యాటర్లు కూడా ఆర్‌సీబీపైనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. వీరి తర్వాత ఇషాన్ కిషన్(103 మీటర్లు), ఆండ్రీ రస్సెల్(102), అభిషేక్ శర్మ(99), ట్రావిస్ హెడ్(98)తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ రికార్డు అల్బీ మోర్కెల్ పేరిట ఉంది. 2008లో సీఎస్‌కే తరఫున బరిలోకి దిగిన అతను డెక్కన్ ఛార్జర్స్‌పై 125 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కుచెదరలేదు. 2008లో ఆర్‌సీబీ తరఫున ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల సిక్సర్ కొట్టాడు. గిల్ క్రిస్ట్(122), రాబిన్ ఊతప్స(120), క్రిస్ గేల్(119), రాస్ టేలర్(119), యువరాజ్ సింగ్ 119 మీటర్ల సిక్స్‌తో తర్వాతి స్థానంలో ఉన్నారు.

లాకీ ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్‌లో హెన్రీచ్ క్లాసెన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌ రెండో బంతిని స్లాట్‌లో వేయగా.. క్లాసెన్ స్ట్రైట్‌గా స్టేడియం బయట పడేసాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67), ఎయిడెన్ మార్క్‌రమ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదే సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 277/3 పరుగుల రికార్డ్ నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా మ్యాచ్‌తో ఆ ఘనతను అధిగమించింది.

Story first published: Monday, April 15, 2024, 22:50 [IST]
Other articles published on Apr 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+