ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చిన్నస్వామి మైదానం ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
'మేం చేజింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ ఈ సీజన్ మొత్తం ఒకేలా ఉండనుంది. కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేం అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. జట్టులో కీలక మార్పులు చేశాం. మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను పక్కనపెట్టాం. లాకీ ఫెర్గూసన్ జట్టులోకి వచ్చాడు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో తమ జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చిందని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'టీ20 క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్ గెలవలేం. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. చిన్నస్వామి స్టేడియంలో ఎంత లక్ష్యం నమోదు చేసినా కొన్నిసార్లు సరిపోదు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ముఖా ముఖి పోరు..
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12, బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత 5 మ్యాచ్‌ల్లో మాత్రం బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. మరోవైపు టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో చేజింగ్ టీమ్‌కు కలిసి రానుంది.
తుది జట్లు:
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహన్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైశాఖ్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టీ నటరాజన్