Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: అభిషేక్ శర్మ భారీ సిక్సర్.. టాటా కారుకు సొట్ట!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కొట్టిన భారీ సిక్సర్ ధాటికి టాటా కర్వ్ కార్‌కు సొట్ట పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్‌ ఐదో బంతిని భువీ షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. భువనేశ్వర్ కుమార్ డీప్ మిడ్‌ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అతని సిక్సర్ ధాటికి అడ్వర్టైజ్‌మెంట్ కోసం మైదానంలో పెట్టిన కారు విండిషీల్డ్‌కు బలంగా తాకింది. ఆ బంతి ధాటికి కారుకు పెద్ద సొట్టపడింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'టాటా కారుకే డెంట్ పడిందంటే.. అభిషేక్ హ్యాండ్ పవర్ మాములుగా లేదుగా.. 'అని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.

RCB vs SRH Abhishek Sharma s Monstrous Six Smashes Tata Curvv Windshield Off Bhuvneshwar Video

ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 నాటౌట్)‌, అభిషేక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో రోమారియో షెపర్డ్(2/14) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62), విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43)‌టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, May 23, 2025, 20:11 [IST]
Other articles published on May 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+