Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: స్వింగ్ కింగ్ ‘సెంచరీ’.. విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్!

బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఈ ఫీట్ సాధించాడు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఫస్ట్ బాల్‌కే ఆర్‌సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్.. ఐపీఎల్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 84 మ్యాచ్‌ల్లో ట్రెంట్ బౌల్ట్ ఈ ఫీట్ సాధించాడు. స్వింగ్ కింగ్ అయిన ట్రెంట్ బౌల్ట్.. పవర్ ప్లేలో తప్పకుండా వికెట్ తీస్తాడు. పిచ్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా స్వింగ్ చేయగల బౌల్ట్.. 2020 నుంచి తొలి ఓవర్‌లోనే 21 వికెట్లు పడగొట్టాడు.

Trent Boult Completes 100 IPL Wickets after Dismissing Virat Kohli

'గో గ్రీన్'కార్యక్రమంలో భాగంగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగింది. పర్యావరణ పరీరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఆర్‌సీబీ గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తోంది. 2011 సీజన్ నుంచి ప్రతీ ఏడాది ఒక మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలతో ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో తాత్కలిక సారథిగా విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్నాడు.

గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా టాస్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు విరాట్ కోహ్లీ ఓ మొక్కను బహుమతిగా అందజేశాడు. అనంతరం మాట్లాడుతూ.. కెప్టెన్‌గా అంత బాగానే ఉన్నా తన టాస్ రికార్డే బాలేదని విరాట్ కోహ్లీ చమత్కరించాడు. గత రాత్రే కొన్ని మ్యాచ్‌లకు తాను సారథ్యం వహించాలనే విషయం తెలిసిందని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు దిగింది. గ్రీన్ జెర్సీలోఆడినప్పుడల్లా ఆర్‌సీబీకి అంతగా కలిసిరాలేదు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే గెలిచింది. విరాట్ కోహ్లీ తాజా మ్యాచ్‌తో పాటు గతేడాది జరిగిన గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్ అయ్యాడు. తాజా మ్యాచ్‌లో కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన షెహ్‌బాజ్ అహ్మద్(2)ను కూడా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు.

దాంతో ఆర్‌సీబీ 12 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో ఇంపాక్ట్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడుతున్నాడు. భారీ సిక్సర్లతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

Story first published: Sunday, April 23, 2023, 16:10 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+