Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: అందుకే అనూజ్ రావత్‌‌ను పక్కన పెట్టాం: ఫాఫ్ డుప్లెసిస్

 RCB vs RR: Faf du Plessis says we want to see the real Virat Kohli play

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్లుగానే ఆర్‌సీబీ ఒక మార్పు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్‌కాయ్ స్థానాల్లో డారిల్ మిచెల్, కుల్దీప్ సేన్ రాజస్థాన్ తుది జట్టులోకి వచ్చారు. ఆర్‌సీబీలోకి రజత్ పటిదార్ రాగా.. అనూజ్ రావత్ ఉద్వాసనకు గురయ్యాడు. అయితే విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడిద్దామనే ఉద్దేశంతోనే అనూజ్ రావత్‌ను పక్కనపెట్టామని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అసలు సిసలు విరాట్ ఆటను చూసేందుకే ఓపెనర్‌గా అతన్ని ప్రమోట్ చేశామన్నాడు.

'ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి బ్యాటింగ్‌లో రాణించాలనే ఉద్దేశంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాను. గత మ్యాచ్ వైఫల్యాన్ని పక్కనపెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్లే ఆఫ్స్ చేరడంపైనే ఫోకస్ పెట్టాం. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. అనుజ్ రావత్ స్థానంలో రజత్ పటిదార్ బరిలోకి దిగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అసలు సిసలు విరాట్‌ ఆటను చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇదో కొత్త మ్యాచ్, కొత్త గేమ్.. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం'అని డుప్లెసిస్ తెలిపాడు.

ఇక టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు కూడా సంతోషంగా ఉన్నామని చెప్పాడు. జోస్ బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఓస్టాండర్డ్ సెట్ చేశాడు. అతని నుంచి జట్టు మొత్తం నేర్చుకుంటుంది. టీమ్ పరిస్థితులకు తగట్లు అతను ఆడుతున్న తీరు.. టీమ్‌కు తనవంతు ఇస్తున్న బెస్ట్ అన్నిటినీ నేర్చుకునేందుకు తమ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. 'అని శాంసన్ పేర్కొన్నాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: ఫాప్‌ డుప్లెసిసస్‌(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సుయాశ్ ప్రభుదేశాయ్, రజాత్ పటిదార్, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, హజెల్ వుడ్, మహమ్మద్‌ సిరాజ్‌

రాజస్తాన్‌: జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, డారిల్ మిచెల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్ సేన్, యుజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ.

Story first published: Tuesday, April 26, 2022, 22:46 [IST]
Other articles published on Apr 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+