Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: మలుపు తిప్పిన రనౌట్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఆర్‌సీబీ!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. కీలక సమయంలో సుయాశ్ ప్రభుదేశాయ్ సూపర్ ఫీల్డింగ్‌తో షిమ్రాన్ హెట్‌మైర్‌ను రనౌట్ చేయడం ఆర్‌సీబీకి కలిసొచ్చింది. చివరి ఓవర్‌లో ధృవ్ జురేల్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) స్ట్రైకింగ్ తీసుకోకపోవడం రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), గ్లేన్ మ్యాక్స్‌వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

 Faf Du Plessis, Glenn Maxwell, Harshal Patel Shine As RCB Beat RR

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓటమిపాలైంది. దేవదత్ పడిక్కల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు మహమ్మద్ సిరాజ్ బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే స్టన్నింగ్ డెలివరీతో డేంజరస్ జోస్ బట్లర్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. దాంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీని స్కోర్ బోర్డును పరుగెత్తించింది. 30 బంతుల్లో దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కెప్టెన్ కోహ్లీ.. డేవిడ్ విల్లేను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. జోరు మీదున్న పడిక్కల్‌ను విల్లే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ వెంటనే హాఫ్ సెంచరీకి చేరువైన యశస్వి జైస్వాల్‌ను హర్షల్ పటేల్ క్యాచ్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా హర్షల్ పటేల్ దెబ్బతీసాడు. క్యాచ్ ఔట్‌గా సంజూని పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్ పోరాడగా.. సుయాశ్ ప్రభుదేశాయ్ సూపర్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

స్టన్నింగ్ త్రో సాయంతో డేంజరస్ హెట్‌మైర్‌(3)ను రనౌట్ చేశాడు. 19వ ఓవర్ సిరాజ్ 13 పరుగులివ్వడంతో చివరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. అశ్విన్ రెండు బౌండరీలు బాది క్యాచ్ ఔటయ్యాడు. దాంతో చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమవ్వగా.. రెండు పరుగులే ఇవ్వడంతో ఆర్‌సీబీ విజయాన్నందుకుంది.

Story first published: Sunday, April 23, 2023, 19:45 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+