For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR: ఐపీఎల్‌ చరిత్రలో.. తొలి ఆటగాడిగా దేవదత్‌ పడిక్కల్‌ అరుదైన రికార్డు!!

RCB vs RR: Devdutt Padikkal only player in IPL history to score 3 fifties in first 4 games
IPL 2020,RCB vs RR : Devdutt Padikkal Only Player In IPL History To Score 3 Fifties In First 4 Games

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఓపెనర్ దేవదత్‌ పడిక్కల్‌ మరోసారి మెరిశాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌.. మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది పడిక్కల్‌కు మూడో ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.

తొలి ప్లేయర్‌గా రికార్డు

తొలి ప్లేయర్‌గా రికార్డు

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. దేవదత్‌ పడిక్కల్‌ మూడు హాఫ్‌ సెంచరీలు సాధించడం విశేషం. ఇది ఒక రికార్డుగా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా పడిక్కల్‌ అరుదైన రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై 54 పరుగులు సాధించిన పడిక్కల్‌.. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో 1 పరుగు చేసి విఫలమయ్యాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 56 పరుగులు సాధించాడు. తాజాగా రాజస్తాన్‌పై మరో హాఫ్‌ సెంచరీ చేశాడు.

ప్రధాన ఆటగాడిగా

ప్రధాన ఆటగాడిగా

ఐపీఎల్‌ 2020లో పార్థీవ్‌ పటేల్‌ స్థానంలో ఓపెనర్‌గా దిగిన దేవదత్‌ పడిక్కల్‌.. అంచనాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. పడిక్కల్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ ఇప్పుడు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. దాంతో పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ

ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ

గత విజయ్‌ హజారే ట్రోఫీలో (50 ఓవర్లు), సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో దేవదత్‌ పడిక్కల్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 20 ఏళ్ల పడిక్కల్‌ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు బాదాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించి వెలుగులోకి వచ్చాడు. దూకుడు, సహనం, సంయమనం, టెక్నిక్‌ కలిగిన పడిక్కల్‌ తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు.

45 బంతుల్లో 63

45 బంతుల్లో 63

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్‌ (39 బంతుల్లో 47; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. బెంగళూరు బౌలర్లలో చహల్‌ 3, ఉడాన 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా.. దేవదత్‌ పడిక్కల్‌ (45 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) లీగ్‌లో మూడో అర్ధశతకం సాధించాడు. చహల్‌ (3/24)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

RCB vs RR: సంజూ శాంసన్‌ నిజంగానే ఔట్ అయ్యాడా?.. మండిపడుతున్న ఫాన్స్!!

Story first published: Sunday, October 4, 2020, 7:47 [IST]
Other articles published on Oct 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+