Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: అమ్మో ఏప్రిల్ 23.. విరాట్ కోహ్లీకి కాళ రాత్రే! అన్నీ గోల్డెన్ డకౌట్లే!

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్‌కు వికెట్లు ముందు దొరికిపోయాడు. అయితే ఈ ఒక్కరోజే కాకుండా ఐపీఎల్‌లో ఏప్రిల్ 23న ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

2017 నుంచి తాజా మ్యాచ్ వరకు ఏప్రిల్ 23న మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడింటిలోనూ గోల్డెన్ డకౌటయ్యాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయిన విరాట్ కోహ్లీ.. గతేడాది(2022) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ అయ్యాడు.

 April 23 brings bad luck for Virat Kohli

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘోర పరాజయం ఎదుర్కొంది. కేకేఆర్‌ చేతిలో 2017లో 49 పరుగులకే కుప్పకూలి 82 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన ఆర్‌సీబీ.. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 68 పరుగులకే కుప్పకూలి 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. గ్రీన్ జెర్సీలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం గమనార్హం.

గో గ్రీన్'కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగింది. పర్యావరణ పరీరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఆర్‌సీబీ గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తోంది. 2011 సీజన్ నుంచి ప్రతీ ఏడాది ఒక మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలతో ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో తాత్కలిక సారథిగా విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి బౌల్ట్ షాకిచ్చాడు. విరాట్ కోహ్లీ(0)తో పాటు షెబాజ్ అహ్మద్(2)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 12 పరుగులకే ఆర్‌సీబీ 2 వికెట్లు కోల్పోగా.. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడిన మ్యాక్స్‌వెల్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Sunday, April 23, 2023, 16:40 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+