ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను పోలీ ఉన్న వ్యక్తిని చూసి విరాట్ కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. ముసి ముసి నవ్వులతో చేతులను అడ్డుపెట్టుకొని పొట్టచెక్కలయ్యేలా నవ్వాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అభిమాని అచ్చం శిఖర్ ధావన్‌లానే బొడి గుండు స్టైల్‌లో అతని డూప్‌లా కనిపించాడు. అచ్చం తనలానే ఉన్న సదరు అభిమానిని చూసి శిఖర్ ధావన్ కూడా అవాక్కయ్యాడు. టీవీ కెమెరామెన్ బిగ్ స్క్రీన్‌పై సదరు ఫ్యాన్‌ను పదే పదే చూపించడంతో అతను కోహ్లీ, ధావన్ కంటబడ్డాడు.

ధావన్ డూప్ బోడుగుండును చూసి కోహ్లీ పడి పడి నవ్వుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), జితేశ్ శర్మ(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
చివర్లో శశాంక్ సింగ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీసారు.