RCB vs PBKS: లివింగ్ స్టోన్, బెయిర్ స్టో విధ్వంసం.. ఆర్‌సీబీ ముందు కొండంత లక్ష్యం!

ముంబై: లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

బెయిర్ స్టో విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ముఖ్యంగా బెయిర్ స్టో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పంజాబ్ 5 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(21)ను గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఔట్ చేసినా.. బెయిర్ స్టో సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన హసరంగా తన ఫస్ట్ ఓవర్‌లోనే భానుక రాజపక్స(1)ను ఔట్ చేశాడు.

చెలరేగిన లివింగ్ స్టోన్..
మరోవైపు ధాటిగా ఆడిన బెయిర్ స్టో స్కోర్ వేగం తగ్గకుండా చూసుకున్నాడు. షెహ్‌బాజ్ అహ్మద్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఔటైనా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆ ఆనందం లేకుండా చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(19), జితేశ్ శర్మ(9), హర్‌ప్రీత్ బ్రార్(7) ఔటైనా.. మరోవైపు లివింగ్ స్టోన్ చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

బ్రేక్ వేసిన హర్షల్..
ఇక హజెల్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో 35 బంతుల్లోనే లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో లివింగ్ స్టోన్ జోరుకు హర్షల్ పటేల్ కళ్లెం వేయగా.. ధాటిగా ఆడే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. 230 ప్లస్ స్కోర్ వెళ్తుందనుకున్న పంజాబ్ స్కోర్ 209 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications