Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs PBKS: అందుకే అతన్ని పక్కనపెట్టాం: ఫాఫ్ డుప్లెసిస్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. అంతేకాకుండా మా జట్టు చేజింగ్‌కు సిద్దంగా ఉంది. ఇప్పటి వరకు ఆర్‌సీబీ టైటిల్ గెలవలేదని విమర్శిస్తున్నారు. కానీ మా లేడీస్ ఈ ఏడాది ఆ లోటును తీర్చారు. వారిచ్చిన స్పూర్తితో ఈ సారి మేం టైటిల్ సాధిస్తాం. ఈ సీజన్‌లో సత్తా చాటేందుకు మా కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు.

RCB vs PBKS IPL 2024 Faf du Plessis reveals the reason why Karn Sharma not playing vs Punjab

ఎలాంటి ఫార్మాట్‌లోనైనా ఒకేసారి అన్ని వికెట్లు కోల్పోలేం. చివరి మ్యాచ్‌లో మేం చివర్లో కోలుకున్నాం. మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశం కూడా ఇదే. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్ల విషయంలో మాత్రం మార్పు చేశాం. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడించాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే కర్ణ్ శర్మను జట్టు నుంచి తప్పించాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపాడు. తొలి మ్యాచ్‌లో మేం అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశామని, దాంతోనే విజయాన్ని అందుకున్నామని తెలిపాడు. ఇదే జోరును టోర్నీ అసాంతం కొనసాగించాలనుకుంటున్నామని, విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, రాహుల్ చాహర్

ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Story first published: Monday, March 25, 2024, 19:29 [IST]
Other articles published on Mar 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+