For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs MI: ముంబైని ఆదుకున్న సూర్య.. ఆర్‌సీబీ ముందు ఈజీ టార్గెట్!

 Suryakumar Yadav powers

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని 152 పరుగులు స్వల్ప లక్ష్యానికే కట్టడిచేశాడు. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీ‌తో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) ఫర్వాలేదనిపించారు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని.. జయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఓపెనర్ల శుభారంభం..

ఓపెనర్ల శుభారంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. సిరాజ్ వేసిన 2వ ఓవర్‌లో బౌండరీల ఖాతా తెరిచిన రోహిత్.. అతని మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదాడు. హసరంగా వేసిన 5వ ఓవర్‌లో ఇషాన్ రెండు, రోహిత్ ఒక బౌండరీ కొట్టగా.. ఆకాశ్ దీప్ వేసిన 6వ ఓవర్‌లో ఒక బౌండరీ రావడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.

ఆ వెంటనే డుప్లెసిస్ హర్షల్ పటేల్ బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు. జోరు మీదున్న రోహిత్‌ను స్లోయర్ ఆఫ్ కట్టర్‌తో హర్షల్ బోల్తా కొట్టించాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ శర్మ(26) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మెయిడిన్ ఓవర్..

మెయిడిన్ ఓవర్..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చి డెవాల్డ్ బ్రెవిస్(8)ను హసరంగా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఇక ఆకాశ్ దీప్ వేసిన 10వ ఓవర్ ముంబై పతనాన్ని శాసించింది. రెండో బంతికి ఇషాన్ కిషన్(26) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ రనౌటయ్యాడు. సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫీల్డింగ్‌తో బంతిని వికెట్లను కొట్టి తిలక్ వర్మను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ ఓవర్‌లో ముంబై ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఆ మరుసటి ఓవర్‌లోనే కీరన్ పొలార్డ్(0)ను హసరంగా ఎల్బీగా ఔట్ చేశాడు. బౌండరీలతో సూర్య ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌లో హర్షల్ పటేల్ రమణ్‌దీప్ సింగ్(6)‌ను ఔట్ చేశాడు.

సూర్య ప్రతాపం..

సూర్య ప్రతాపం..

సూర్యకు జయదేవ్ ఉనాద్కత్ సహకారం అందించడంతో సూర్య భారీ షాట్లతో చెలరేగాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు క్విక్ డబుల్, సింగిల్ తీసి సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు సిక్స్‌లు బాదిన సూర్య.. 23 పరుగులు పిండుకున్నాడు. అయితే చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్ 7 పరుగులు ఇవ్వడంతో ముంబై 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. సూర్య, ఉనాద్కత్ 6వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించారు.

Story first published: Saturday, April 9, 2022, 21:44 [IST]
Other articles published on Apr 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+