Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs MI: అందుకే ఉనాద్కత్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ

RCB vs MI: Rohit Sharma Says Jaydev Unadkat and Ramandeep comes in place of Mills, Daniel Sams

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మళ్లీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడ్డ ముంబై ఇండియన్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ లైనప్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమైన డానియల్ సామ్స్‌తో పాటు అంతగా ప్రభావం చూపని టైమిల్ మిల్స్‌పై వేటు వేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో జయదేవ్ ఉనాద్కత్, రమణ్‌దీప్‌లకు అవకాశం ఇచ్చింది.

టీమ్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకుకనేవాళ్లమని చెప్పాడు.

1
53627

'మ్యాచ్ జరుగుతున్న కొద్ది ఈ పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతోంది. ఈ వికెట్ సహజ శైలి అది. మేం మా ప్రణాళికల తగ్గట్లు ఆడటమే ముఖ్యం. అన్ని మ్యాచ్‌లు పెద్దవే. తొలి విజయం ఎప్పుడైనా ఉత్సాహన్నిస్తోంది. అది ఈ రోజు రాత్రి జరుగుతుందని కోరుకుంటున్నా. సూర్యకుమార్ యాదవ్ క్వాలిటీ ప్లేయర్. కచ్చితంగా మా బ్యాటింగ్‌కు అతను అతిపెద్ద బలం. అతనిలానే ఇతర బ్యాటర్లు రాణించాలనుకుంటున్నా. జట్టులో రెండు మార్పులు చేశాం. జయదేవ్ ఉనాద్కత్, రమణ్‌దీప్ జట్టులోకి వచ్చారు. 'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

RCB vs MI: Rohit Sharma Says Jaydev Unadkat and Ramandeep comes in place of Mills, Daniel Sams

టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఫీల్డింగ్ ఎంచుకుంటున్నానని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుందని భావిస్తున్నానని తెలిపాడు. వరుసగా రెండు విజయాలు ఉత్సాహాన్ని ఇచ్చాయని, ముఖ్యంగా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అనే అరుపులు సంతోషాన్నిచ్చాయన్నాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని రూథర్ ఫోర్డ్ స్థానంలో మ్యాక్స్‌వెల్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

తుది జట్లు:
ముంబై ఇండియ‌న్స్‌: ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనాద్కత్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, రమణ్‌దీప్, బాసిల్ థంపి.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్‌, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

Story first published: Saturday, April 9, 2022, 20:02 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+