RCB vs MI: ఆర్‌సీబీతో మ్యాచ్.. రోహిత్ ముందు అరుదైన రికార్డు.. మరో 10 పరుగులు చేస్తే!!

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో పోరుకు సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ఈరోజు రాత్రి తలపడనున్నాయి. తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో నిరాశపర్చినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుంది ముంబై. రెండేసి మ్యాచ్‌లాడిన ఇరు జట్లు ఇప్పుడు మూడో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుకి కొద్ది దూరంలో నిలిచాడు.

మరో 10 పరుగులు చేస్తే
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే.. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మాత్రమే 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈరోజు కనుక రోహిత్ 10 పరుగులు చేస్తే.. కోహ్లీ, రైనా తర్వాత 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.

కోహ్లీ@1
ఐపీఎల్‌లో 179 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 37.42 సగటు, 131.5 స్ట్రైక్‌రేట్‌తో 5,427 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 193 మ్యాచ్‌ల్లో 33.33 సగటు, 137.1 స్ట్రైక్‌రేట్‌తో 5,368 పరుగులు బాదాడు. రోహిత్ శర్మ 190 మ్యాచ్‌ల్లో130.8 స్ట్రైక్‌రేట్‌తో 4,990 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ.. రోహిత్ కంటే 400లకు పైగా పరుగులు ఆధిక్యంలో ఉన్నాడు. ఈ సీజన్లో కూడా ఆడుతున్నాడు కాబట్టి.. అతన్ని అధిగమించే అవకాశం లేదు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికీ రైనా దూరమయ్యాడు. రోహిత్ టాప్ క్లాస్ ప్రదర్శన చేస్తే.. రైనా పరుగులను దాటే అవకాశం ఉంది.

మరో సిక్స్ కొడితే
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు సిక్సులు బాదిన 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. రోహిత్ మరో సిక్స్ కొడితే.. ముంబై ఇండియన్స్ తరఫున 150 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకూ విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ముంబై తరఫున 177 సిక్సులు బాదాడు. మొత్తానికి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి.

15 మ్యాచ్‌ల్లో 405 పరుగులు
రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై జట్టును నాలుగుసార్లు (2013, 2015, 2017, 2019) విజేతగా నిలిపాడు. ఇప్పుడు యూఏఈలోనూ మరోసారి టైటిల్ విన్నర్‌గా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. గత ఏడాది టోర్నమెంట్‌లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 28.93 సగటుతో 405 పరుగులు చేసాడు.
RCB vs MI Preview: ఊపుమీద ముంబై.. చతికిలబడ్డ బెంగళూరు.. మ్యాచ్ ముగించేదెవరో!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications