
11 బంతుల్లో 3 పరుగులే:
ఐపీఎల్ 2020లో ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 18 పరుగులే చేశాడు. గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. డిఫెన్సె చేయడానికే తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ.. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టాప్ బ్యాట్స్‌మన్, అది టీ20 మ్యాచ్, తప్పక గెలవాల్సిన పరిస్థితి.. అయినా కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులే చేశాడు.

13 బంతులాడి 14 రన్స్:
అంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగినమ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్.. కాట్రెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేశాడు. దీంతో 83 పరుగుల వద్ద ఔట్ అవ్వాల్సిన రాహుల్.. ఏకంగా 136 రన్స్ చేశాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. అందులో విరాట్ 13 బంతులాడి 14 రన్స్ చేశాడు. పుంజుకుంటున్న దశలో టీ నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో 180 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 37.42 సగటు, 131.5 స్ట్రైక్‌రేట్‌తో 5,430 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు:
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 5 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసిన ఘనత కోహ్లీది. అలాంటి కోహ్లీ ఐపీఎల్ 2020లో మాత్రం పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ కింగ్‌కు ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీ త్వరగా ఫామ్‌లోకి రావాలని, భారీ ఇన్సింగ్స్ ఆడాలని వారు కోరుకుంటున్నారు. వాస్తవానికి గత సీజన్ నుంచే విరాట్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. చివరి మ్యాచ్‌లో 7 బంతుల్లో 16 రన్స్.. అంతకుముందు మ్యాచ్‌లో 7 బంతుల్లో 25 రన్స్ చేశాడు. గత సీజన్ నుంచి ఇప్పటి వరకూ 8 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. 25 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 82 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
నా గతాన్ని మర్చిపోతున్నారు.. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాను: గంగూలీ


Click it and Unblock the Notifications












