
ఏ ఆటగాడితోనైనా మాట్లాడుతా:
'గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా ఉన్నాను. అప్పుడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు అండగా నిలిచాను. ఇప్పుడు నేను బీసీసీఐ అధ్యక్షునిగా ఉండవచ్చు కానీ భారత్ తరఫున దాదాపు 500 మ్యాచ్‌లాడాను. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓ సీనియర్ ఆటగాడిగా యువ క్రికెటర్లకు సహాయం చేస్తా. అది శ్రేయస్ అయ్యర్ కావొచ్చు లేదా విరాట్ కోహ్లీ అవ్వొచ్చు. వారికి నా సలహాలు కావాలంటే కచ్చితంగా ఇస్తాను' అని సౌరవ్ గంగూలీ తెలిపారు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదన్నారు.

ఆ పదవికి రాజీనామా:
పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను మంచి ఆటగాడిగా, కెప్టెన్‌గా మెరుగవ్వడానికి రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ పాత్ర ఎంతో ఉందన్నాడు. దీంతో ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు దాదా మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజన నిబంధనలు ఉల్లఘిస్తున్నాడని ఆరోపించారు. అయితే దాదా గత సీజన్‌లో ఢిల్లీకి మెంటార్‌గా వ్యవహరించాడు. అధ్యక్షుడి పదవి చేపట్టిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశాడు.

భారత్‌లోనే జరిపేందుకు ప్రయత్నిస్తాం:
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని సౌరవ్ గంగూలీ తెలిపారు. 'భారత గడ్డపై సిరీస్ జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం' అని దాదా పేర్కొన్నారు.

ఆట జరిగాలి.. జీవితాలూ నిలవాలి:
'కరోనా కారణంగా గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి, ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్ జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహించి చూపించడం సంతోషంగా ఉంది' అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది.
RCB vs MI: అరుదైన రికార్డు.. అనిల్ కుంబ్లే సరసన వాషింగ్టన్ సుందర్!!


Click it and Unblock the Notifications
