For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs MI: ఆ ఒక్క పొరపాటే.. ముంబై ఇండియన్స్‌ను ముంచిందా?!!

RCB vs MI: One mistake which Mumbai Indians made costed the match
IPL 2020,RCB vs MI : One Big Mistake That Cost Mumbai Indians Loss The Match || Oneindia Telugu

హైదరాబాద్: సోమవారం రాత్రి చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది.

 ఒకే రకమైన పొరపాటు:

ఒకే రకమైన పొరపాటు:

ఐపీఎల్ 2020లో ఇప్పటికే రెండు సూపర్‌ ఓవర్‌లు జరిగాయి. లీగ్ ఆరంభంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య సూపర్‌ ఓవర్ జరగ్గా.. ఢిల్లీ విజయం సాధించింది. తాజాగా బెంగళూరు గెలుపొందింది. అయితే సూపర్‌ ఓవర్‌లో ఓడిన పంజాబ్, ముంబై జట్లు ఒకే రకమైన పొరపాటు చేశాయి. మ్యాచులో అద్భుతంగా పోరాడిన మయాంక్ అగర్వాల్ (89)ను పంజాబ్ జట్టు సూపర్‌ ఓవర్‌లో ఆడించలేదు. ముంబై కూడా అదే తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది. అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2x4, 9x6)ను కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్‌ ఓవర్‌లో బరిలోకి దించలేదు. ఫామ్‌లో ఉన్న కిషన్‌ను కాదని కీరన్ పోలార్డ్ జతగా హార్దిక్ పాండ్యాను పంపాడు రోహిత్.

కిషన్‌కు బదులు పాండ్యా:

కిషన్‌కు బదులు పాండ్యా:

మ్యాచ్ ఆసాంతం పోరాడిన ఇషాన్ కిషన్ అలసిపోయి, చెమట కారణంగా అసౌకర్యంగా ఉండటంతో.. అతడి బదులు హార్దిక్ పాండ్యాను బరిలో దింపినట్లు మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ ఇదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఒకవేళ ఫామ్‌లో ఉన్న కిషన్‌ను సూపర్‌ ఓవర్‌లో ఆడిస్తే.. బౌండరీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. లెఫ్ట్ హ్యాండర్ అయిన కిషన్ ఆడితే కచ్చితంగా ప్లస్ అయ్యేవాడు. ఇక రెండు బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. రెండు పరుగులు మాత్రమే చేశాడు.

 డివిలియర్స్‌ మెరుపులు:

డివిలియర్స్‌ మెరుపులు:

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అరోన్‌ ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలు బాదగా.. డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (10 బంతుల్లో 27 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి.

 ఇషాన్‌ కిషన్ జోరు:

ఇషాన్‌ కిషన్ జోరు:

అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (8) త్వరగానే ఔట్ అయ్యాడు. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌ (0) ఔట్‌ కాగా.. డికాక్‌ (14) కూడా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా (15) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ సమయంలో ఇషాన్‌, పొలార్డ్‌ పోరాటం చేశారు. తొలుత 15 ఓవర్లకు 112/4తో నిలవడంతో అసలు గెలుస్తుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఇషాన్‌ కిషన్ ‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6), కీరన్‌ పొలార్డ్‌ (56; 23 బంతుల్లో 2x4, 5x6) రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 30 బంతుల్లో 89 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది.

IPL 2020: చెన్నై అభిమానులకు షాక్.. సురేష్ రైనా పేరును తొలగించిన సీఎస్‌కే!!

Story first published: Tuesday, September 29, 2020, 11:10 [IST]
Other articles published on Sep 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+