
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫిట్‌నెస్ కారణంగా సౌరభ్ తివారి బదులు ఇషాన్ కిషాన్ జట్టులోకి తీసుకున్నామని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని చెప్పాడు. తుది జట్టులో మూడు మార్పులు చేశామన్నాడు. ఫిలప్ జోష్, డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో ఆడమ్ జంపా, ఇసురు ఉడాన, ఉమేశ్ స్థానంలో గుర్‌క్రీత్ సింగ్‌ను తీసుకున్నామని తెలిపాడు. టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 150వ మ్యాచ్.
ఇక చెన్నై చేతిలో ఓడి.. కోల్‌కతాను ఓడించిన ముంబై మంచి ఊపులో ఉండగా.. హైదరాబాద్‌పై గెలిచి.. కింగ్స్ పంజాబ్ చేతిలో ఓడిన ఆర్‌సీబీ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ టోర్నీలో ఇప్పుటి వరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా 16-9తో ముంబై లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యం చెలాయించాలని రోహిత్ సేన భావిస్తుండగా.. లెక్క సరిచేయాలి కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే దుబాయ్ మైదానంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ రోహిత్ సేన ఓడిపోయింది. ఇది బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ఈ మైదానంలో బెంగళూరు నాలుగు మ్యాచ్‌లాడి.. రెండింట్లో ఓడి మరో రెండింట్లో గెలిచింది.
తుది జట్లు
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదూత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబి డివిలియర్స్, శివం దూబే, ఆడమ్ జంపా, ఇసురు ఉడాన, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, గురుక్రీత్, యుజ్వేంద్ర చాహల్